మన్నవరం ప్రాజెక్టుపై వెంకయ్య ఆరా
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా మన్నవరంలో ఏర్పాటుచేయతలపెట్టిన ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎల్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ప్రాజెక్టులో పురోగతి కనిపించడం లేదన్న కారణంతో వెంకయ్యనాయుడు శనివారం ఎన్టీపీసీ ఎండీ అరూప్ రాయ్‌ను పిలిపించి ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. గతంలో ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా టర్బయిన్లు, బాయిలర్లకు డిమాండ్ లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా మందగించాయని, స్థల సేకరణ పనులు కూడా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ వివరించినట్టు తెలిసింది.
మన్నవరం వైఎస్సార్‌పురంలోని ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎల్ పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్బీపీపీఎల్) పనులు ముందుకు సాగడం లేదని, వేగవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కలసి విన్నవించిన సంగతి తెలిసిందే.