Mannavaram
-
మన్నవరంలో సోలార్ ఉపకరణాల తయారీ
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలను నిజంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి 750 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయగా ఆయన మరణానంతరం అది అటకెక్కింది. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ మన్నవరంలో సోలార్ వంటి పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది. అలాగే, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉపకరణాల దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు మాన్యుఫాక్చరింగ్ జోన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు ఇష్టమైన రాష్ట్రాలు, భాగస్వామ్య కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. వీటిలో.. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాలను (బ్రౌన్‌ఫీల్డ్) సోలార్ ఉపకరణాల యూనిట్లుగా మార్చడంతోపాటు వీటికి అదనంగా మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో.. బ్రౌన్‌ఫీల్డ్ విభాగంలో మన్నవరాన్ని అభివృద్ధిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఒక్కొక్కటి రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్లలో రూ.400 కోట్లు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (సీఐఎఫ్), కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ (సీటీఎఫ్)లకు గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కానీ, భాగస్వామ్య కంపెనీలుగానీ ముందుకు రావచ్చని, ఆసక్తి కలిగిన సంస్థలు మే 4లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. ఇక మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కోసం నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భూములను కేటాయించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కానీ, ఒక్కసారిగా థర్మల్ విద్యుత్‌కు డిమాండ్ తగ్గడంతో ఈ కేంద్రం నామమాత్రంగా ఉండిపోయింది. అనంతరం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి మన్నవరంలో భారీ ఉపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసే నిమిత్తం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపారు. అలాగే, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నవంబర్ 11, 2021లో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌ను కలిసి పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదిత మూడు విద్యుత్ ఉపకరణ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మన్నవరాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం మూడు పునరుత్పాదక విద్యుత్ పరికరాల యూనిట్లను ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుందని ఏపీఐఐసీ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్కు కేటాయించారని.. దీన్ని ఏ విధంగా భాగస్వామ్య కంపెనీగా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి బిడ్డింగ్‌లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. -
‘మన్నవరం ఎప్పటికి పూర్తవుతుంది’
న్యూఢిల్లీ: మన్నవరం విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. 2010లో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసినా ఇప్పటివరకు ఇక్కడ గుర్తించదగ్గ పని జరగలేదని ఆయన రాతపూర్వక ప్రశ్నలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వాస్తవ వ్యయం, దీని ద్వారా కలిగే ఉపాధి విషయాలను వెల్లడించాలని విజయసాయిరెడ్డి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్.. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీల జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్బీపీపీఎల్ ఆధ్వర్యంలో చేపడతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో ఆరువేల కోట్లతో చేపట్టాలని భావించినా.. అనంతరం మొదటి దశ పెట్టిబడిని తగ్గించుకున్నట్లు తెలిపారు. 2011 లో ఎన్బీపీపీఎల్ నిర్వహించిన బోర్డు సమావేశంలో రెండో దశ పనులకు నాలుగైదేళ్ల తరువాతే వెల్లాలని నిర్ణయించుకుందని సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6100 మంది ఉపాధి లభింస్తుందని డీపీఆర్‌లో అంచనావేసినట్లు తెలిపారు. -
మన్నవరంలో నేడు భారీ బహిరంగ సభ
తిరుపతి: మన్నవరంలో బెల్ ప్రాజెక్ట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఆదివారం ఆయన చేపట్టిన పాదయాత్ర మన్నవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు మన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నేటి మధ్యాహ్నానికి మన్నవరం చేరుకుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చిత్తూరు జిల్లాలోని మన్నవరంలో బెల్ ప్రాజెక్టును తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
మన్నవరం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
– వెంకయ్య, బాబు చేతగాని దద్దమ్మలు : యండపల్లి – ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్దాం : ఎంపీ వరప్రసాద్ – రక్షణ వలయంలో సన్మానమా.. సిగ్గుండాలి : రోజా – ఐక్యవేదిక ద్వారా సాధిద్దాం : భూమన కరుణాకరరెడ్డి తిరుపతి తుడా: రాయలసీమకు వెన్నెముక లాంటి మన్నవరం ప్రాజెక్టు సాధన కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. మన్నవరం పరిశ్రమ సాధన కోసం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షను శనివారం సాయంత్రం ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా యండపల్లి మాట్లాడుతూ సీమ ప్రజల గొంతు నొక్కుతున్న వెంకయ్య, చంద్రబాబులకు ప్రజలంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాలన్నారు. మన్నవరం తరలించుకు పోతుంటే చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అఖిల పక్షంగా ఏర్పడి మన్నవరం సాధించే వరకు విశ్రమించేది లేదని చెప్పారు. తన దీక్షకు మద్దతిచ్చిన కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లదాం మన్నవరాన్ని తరలించుకుని పోవాలని చూస్తే ఊరుకోమని ఎంపీ వరప్రసాద్ హెచ్చరించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని తాను ఇప్పటికే కేంద్రానికి గుర్తుచేశామన్నారు. తరలింపు కుట్రను భగ్నం చేసేందుకు అందరం కలసి కట్టుగా ఢిల్లీలో గర్జించి కేంద్రం కల్లు తెరిచేలా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రక్షణ వలయంలో సన్మానమా? ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజల్ని, మన్నవరం, దుగరాజపట్నం ప్రాజెక్టులను అడ్డుకుని సీమ ప్రజలకు తీవ్రం దోహం చేసిన వెంకయ్యనాయుడు రక్షణ వలయంలో సన్మానం చేసుకోవడానికి సిగ్గుండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. దీక్షకు మద్దతిచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ తనను ఎక్కడ అడ్డుకుంటారేమోననే భయంతో వెంకయ్య పోలీసుల చేత దారుణంగా అరెస్టు చేయించారన్నారు. అప్పటి కేంద్ర మంత్రులను ఎదిరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన్నవరం సాధించారన్నారు. 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కలిగించే ఈ ప్రాజెక్టును వెంకయ్య బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలించడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదాను సమాధి చేసినట్టే మన్నవరాన్ని తరలించేందుకు వెంకయ్య, బాబూ పోటీ పడుతున్నారని విమర్శించారు. ఐక్యవేదిక ద్వారా సాధించుకుందాం మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌ను ఐక్యవేదిక ఏర్పాటు చేసి సాధించుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. దీక్షకు దిగిన ఎమ్మెల్సీతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే చంద్రబాబు రోజుకొక దేశంలో తిరిగి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించుకోవడం హాస్యస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6వేల కోట్ల భెల్ ప్రాజెక్ట్ తరలిపోతుంటే అవినీతి మంత్రి బొజ్జల నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ దీక్షకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, గుణశేఖర్ నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం పలికారు. -
నిరసన భెల్ మోగింది
‘భెల్’ తరలింపు యోచనపై పెల్లుబుకుతున్న ఆగ్రహం – తీవ్రంగా ప్రతిఘటిస్తామంటోన్న వైఎస్సార్సీపీ – నియోజకవర్గ కేంద్రాల్లో ఏఐఎస్ఎఫ్ ఆందోళనలు – తరలిస్తే ఊరుకోం : భూమన కరుణాకర్‌రెడ్డి మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ భారీ కర్మాగారాన్ని(భెల్) పక్క రాష్ట్రాలకు తరలించాలన్న యోచనపై నిరసన పెల్లుబుకుతోంది. తరలించాలనే ప్రతిపాదన గుట్టును సాక్షి బహిర్గతం చేశాక వివిధ వర్గాలు కదిలాయి. కేంద్ర ప్రభుత్వ కుట్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతలపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు దీనిపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. మన్నవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబునాయుడు కనబరుస్తోన్న నిర్లక్ష్య వైఖరిని జిల్లా ప్రజానీకం తీవ్రంగా పరిగణిస్తోంది. నిధుల కేటాయింపులో చూపుతున్న అనాసక్తిని తప్పుబడుతోంది. –––––––––––––––––––– సాక్షి ప్రతినిధి, తిరుపతి : మన్నవరంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉపకరణాల తయారీ ఫ్యాక్టరీకి ప్రతిపాదనలు జరిగాయి. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే లభించాయి. ఈ ఫ్యాక్టరీ కోసం 720 ఎకరాలను కేటాయించారు. 2010 సెప్టెంబరు 1న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ భూమి పూజ కూడా చేశారు. అప్పట్లో వేలాది మంది యువకుల్లో ఉపాధి అవకాశాల ఆశలు చిగురించాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన కంప్యూటర్ ఇంజినీరింగ్ పట్టభద్రులు ఫ్యాక్టరీపై బోలెడన్ని కలలు కన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు పరిశ్రమను పూర్తిస్థాయిలో నెలకొల్పే విషయంలోనూ, నిధుల కేటాయింపులోనూ అనాసక్తి చూపింది. దీంతో ఈ ఫ్యాక్టరీ తరలింపు కోసం కేంద్రం యత్నాలు ప్రారంభించింది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకూ తరలింపు వ్యవహారం శరాఘాతంలా తాకింది. గడచిన వారం రోజులుగా జిల్లా అంతటా నిరసన ఉద్యమాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వాçమపక్ష పార్టీలు ఈ యోచనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరుద్యోగ, గిరిజన, మహిళా సంఘాలు కూడా తరలింపు యోచనను విరమించుకోవాలని నినదిస్తున్నాయి. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగజేసే భారీ ప్రాజెక్టును పక్క రాష్ట్రాలకు తరలిస్తే ఆమరణ దీక్షకు పూనుకుంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భెల్ ఫ్యాక్టరీ తరలింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరచాటున చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఫ్యాక్టరీని తరలిస్తే ఊరుకోం : భూమన వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మన్నవరం భెల్ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. కర్మాగారం పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎనలేని కీర్తి, ప్రజాభిమానం లభిస్తుందన్న భయంతోనే టీడీపీ సర్కారు కేంద్రంతో కలిసి కుయుక్తులు పన్ని పరిశ్రమను తరలించేందుకు యోచన చేస్తుందని ధ్వజమెత్తారు. కొత్త పరిశ్రమల స్థాపనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని నిత్యం చెప్పే చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో భారీ పరిశ్రమ తరలిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారని భూమన ప్రశ్నించారు. -
మన్నవరం ప్రాజెక్టుపై వెంకయ్య ఆరా
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా మన్నవరంలో ఏర్పాటుచేయతలపెట్టిన ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ప్రాజెక్టులో పురోగతి కనిపించడం లేదన్న కారణంతో వెంకయ్యనాయుడు శనివారం ఎన్టీపీసీ ఎండీ అరూప్ రాయ్‌ను పిలిపించి ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. గతంలో ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా టర్బయిన్లు, బాయిలర్లకు డిమాండ్ లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా మందగించాయని, స్థల సేకరణ పనులు కూడా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ వివరించినట్టు తెలిసింది. మన్నవరం వైఎస్సార్పురంలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్బీపీపీఎల్) పనులు ముందుకు సాగడం లేదని, వేగవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కలసి విన్నవించిన సంగతి తెలిసిందే.