వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది.
తిరుపతి: మన్నవరంలో బెల్ ప్రాజెక్ట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఆదివారం ఆయన చేపట్టిన పాదయాత్ర మన్నవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు మన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు.
బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలంటూ బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నేటి మధ్యాహ్నానికి మన్నవరం చేరుకుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చిత్తూరు జిల్లాలోని మన్నవరంలో బెల్ ప్రాజెక్టును తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.