Biyyapu Madhusudhan Reddy
-
చంద్రబాబుకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
నూతన వధూవరుల్ని ఆశీర్వదించిన వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డీ కుమార్తె వివాహనికి హాజరైన వైఎస్ జగన్ దంపతులు
-
టీడీపీ నేతలకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
-
మా కార్యకర్త ట్రాక్టర్ ను దగ్ధం చేస్తారా రౌడీ రాజకీయాలు మానుకో..!
-
బియ్యపు మధుసూధన్ రెడ్డి నామినేషన్
-
బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
ప్రచారంలో దూసుకుపోతున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు
-
చంద్రబాబు డ్రామా అక్కడే స్టార్ట్ అయింది..మధుసూదన్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
సీఎం జగన్ దాడిపై బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమోషనల్..
-
మా మధు అన్నకు ఈ సారి మంత్రి పదవి ఇవ్వండి అన్న
-
నీ పార్టీ లో నీకు సీటు ఉందొ లేదో నీకే తెలీదు..ఎమ్మెల్యే బియ్యపు పంచులే పంచులు
-
పవన్, చంద్రబాబుపై నాన్ స్టాప్ పంచులు
-
చంద్రబాబు పిచ్చి వీళ్లందరికీ పాకింది..మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు
-
5 వేల కోట్లు ధారపోశాడు చంద్రబాబు ఎక్కడ అంటే..!
-
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం
-
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి ఫన్నీ సెటైర్లు..!
-
బాలకృష్ణకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూపర్ కౌంటర్
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఫన్నీ కామెంట్స్
-
ఫ్లూటు జింక ముందు ఊదు..సీఎం జగన్ ముందు కాదు..
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఫన్నీ కామెంట్స్..
-
ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు: మధుసూదన్‌రెడ్డి
-
చంద్రబాబు వ్యాఖ్యలకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు శుక్రవారం కలిశారు. శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వామివారి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసిన వేద పడింతులు.. వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్ -
మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సాక్షి, శ్రీకాళహస్తి: విద్యార్థిని చదువు మధ్యలో ఆగిపోకుండా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.50 వేలు సాయం చేసి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తొట్టంబేడు మండలం రాంబట్లపల్లెకు చెందిన సుధాకర్‌నాయుడు, విజయ దంపతుల కుమార్తె జ్యోత్స్న మదనపల్లెలో ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. వారిది పేద కుటుంబం కావడంతో చదువుకు ఇబ్బంది కలిగింది. వారు బుధవారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని కలిసి తమ గోడును వినిపించారు. స్పందించిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా విద్యార్థినికి ల్యాప్‌ట్యాప్‌ను ఈ నెల 20వ తేదీన తీసిస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో చదువు ఆగిపోకుండా సాయం అందిస్తానని వెల్లడించారు. దీంతో సుధాకర్‌నాయుడు దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (భార్య సివిల్స్ పోరాటం..భర్తలో అనుమానం) -
CM YS Jagan: అన్నా.. నీ ఆహ్వానం గుండెల్లో పదిలం
సాక్షి,అమరావతి: సంక్షేమం.. అభివృద్ధి.. జోడు గుర్రాలుగా పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఎంతటి స్థానం సంపాదించుకున్నారో చెప్పేందుకు ఈ ఫొటో ఓ తార్కాణం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీకి ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. తొట్టంబేడు మండలకేంద్రంలోని అరుంధతివాడకు చెందిన వెంకటేశ్వరికి కూడా ఆహ్వానపత్రం అందింది. ఆహ్వాన పత్రికపై సీఎం జగన్ నిలువెత్తు ఫొటో చూడగానే పట్టరాని సంతోషానికి గురైంది. నిలువనీడలేని మాకు ఓ గూడు కట్టించి ఇస్తున్న దేవుడు జగనన్న అంటూ ఉద్వేగానికి గురయింది. ‘నా భర్తకు వచ్చే చాలీచాలని కూలీతో ఇద్దరు పిల్లలున్న మాకు రోజు గడవడమే కష్టం.. అటువంటిది సొంతిల్లు అనేది తీరని కలే.. ఆ కలను నెరవేరుస్తున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. అందుకే దేవుడిచ్చిన అన్న పంపిన ఈ ఆహ్వానాన్ని ఫ్రేమ్ కట్టించుకుని చిరకాలం గుర్తుగా ఉంచుకుంటాం’ అని చెప్పింది. -
నిద్రపోనివ్వలా...లాస్ట్ కి ఏమైంది
-
ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల సాయం
సాక్షి, చిత్తూరు (రేణిగుంట) : నివర్ తుపాన్ సమయంలో రాళ్లకాలువ వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి కుమ్మరిపల్లె దళితవాడకు చేరుకుని బాధిత కుటుంబానికి నగదు అందజేసి వారిని ఓదార్చారు. అలాగే ప్రభుత్వం తరపున మరో రూ.5లక్షల పరిహారాన్ని మృతుడి భార్య నాగభూషణకు అందించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మృతుడి పిల్లలు ధీరజ్, హమీష్‌లను తామే చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగభూషణకు ఫించను మంజూరు పత్రం అందించారు. గ్రామ వలంటీర్ ఉద్యోగాన్ని సైతం ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం అదే వాగులో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వెంకటేష్, లోకేష్‌లను కూడా పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, జువ్వల దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, మునిరెడ్డి, శేషారెడ్డి, బాబ్జీ, హరి పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) -
వాగులో చిక్కుకున్న 11 మంది సురక్షితం..
సాక్షి, ఏర్పేడు(చిత్తూరు): సదాశివపురం కోన వాగు ప్రవాహంలో చిక్కుకున్న 11మంది గిరిజనులను రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరికి రక్షించడానికి శుక్రవారం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి స్వయంగా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఇద్దరు వాగులో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది వారిని రక్షించారు. చదవండి: (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన) -
‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్పయాత్రతో జనం చెంతకు చేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా నేతగా ఎదిగారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. విద్యతోనే ముందడుగు అని విశ్వసించి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా వసతి వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని సమూలంగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌ని చిన్నారులు మావయ్య అంటూ సంబోధిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కొందరు చిన్నారులు ‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’ అంటూ సాగే పాటను ఆలపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట అంటూ ఆయన ఈ పాట ప్రొమోని షేర్ చేశారు. ప్రోమో విడుదలైందని, త్వరలోనే పాట విడుదల చేస్తామని చెప్పారు. (చదవండి: సుపరిపాలన వైఎస్ సంతకం) జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట "బంగారు కొండవయ్య మా జగన్ మావయ్య"@ysjagan #apcmYsJagan #ysjaganindiasbestcm pic.twitter.com/uStVPaBB8u — Biyyapu MadhuSudhan Reddy - MLA (@BiyyapuMadhu) August 31, 2020 -
కరోనా వేళ.. అరాచకానికి కుట్ర
సాక్షి, శ్రీకాళహస్తి: ‘‘రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. కరోనా వైరస్‌తో అధికార యంత్రాంగం యుద్ధం చేస్తుంటే.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ప్రజలకు సాయం చేసేవారిని భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు’’ అని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తిలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తికి తానే కారణమని చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన వల్ల ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని నిరూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 30 ఏళ్లపాటు అధికారం అనుభవించిన బొజ్జల కుటుంబసభ్యులు, ప్రజలకు సేవ చేయకపోగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఉచిత సలహాతో చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శ్రీకాళహస్తిలో రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు 40శాతం ఉన్నారని, వారు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. అందులో భాగంగానే ట్రాక్టర్లో నిత్యావసర సరుకులు తీసుకెళ్లి పట్టణంలోని 35 వార్డులో ఇంటింటికి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో వాహనాల మధ్య 10 అడుగుల దూరం పాటించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. అదే చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు కుప్పంలో సుమారు 200 మందికి బిర్యానీ పంచిపెట్టారని, అయితే దాన్ని తాను తప్పుపట్టలేదని గుర్తుచేశారు. ఈ విధంగా అయినా.. కొంత మంది పేదలకు అన్నదానం చేసినందుకు ఆనందించానన్నారు. శ్రీకాళహస్తిలో మాంసం విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ ఆదివారం ఒక బీజేపీ నాయకుడు రెడ్‌జోన్ పరిధిలోనే బిర్యానీ చేయించి పోలీస్టేషన్లో పంపిణీ చేశారని తెలియజేశారు. ఆ బిర్యానీ తయారు చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్ బయటపడిందని, అతడి ద్వారానే పోలీసులకు వైరస్ సోకిందని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకడానికి ఎవరు కారణమో తెలుస్తోందన్నారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పారిశుధ్య కారి్మకులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దేవుళ్లని కొనియాడారు. అందుకే వారికి పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపారు. విమర్శలు చేస్తున్నవారికి మానవత్వం ఉంటే సాయం చేయాలి కానీ, సేవలందిస్తున్న వారి చేతులు నరకడం ధర్మం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరోనా: పాదపూజ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నివాణకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది పాటు పారిశుధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని సముచితంగా సత్కరిస్తున్నారు. (ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు) ఘన సన్మానం.. పారిశుధ్య కార్మికుల సేవలకు ఫిదా అయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారికి పాదపూజ చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం కార్మికుల కాళ్లు కడిగి, పూలతో అభిషేకం చేశారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నోట్ల దండం.. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల ప్రజాప్రయోజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు పారిశుధ్య కార్మికులను స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నోట్లదండలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు పాల్గొన్నారు. పోలీసులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. పూలవాన విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జల నారాయణరావుతో కలిసి పారిశుధ్య కార్మికులపై పూలు చల్లి అభినందించారు. రేషన్ కార్డు లేని 150 కుటుంబాలకు పది కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. -
నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి చేసిన ప్రసంగం సభలో నవ్వులు పూయించాయి. ఇంగ్లీష్ రాకపోవడంతో తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆయన సభ ముందు ఉంచారు. ఆంగ్ల భాషకు ఉన్న ప్రాధాన్యతను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. అమెరికా వెళ్లినప్పుడు తన అర కొర ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ఎలా తిప్పలు పడ్డారో చెప్పిన సందర్భంగా సభలోని సభ్యులు గొల్లున నవ్వారు. ‘ఈ మధ్య జగనన్న అమెరికా పోయినప్పుడు నేనూ పోయినా. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను ఒక ఒక విషయాన్ని అడిగారు. ఎందుకొచ్చినావ్ అమెరికాకు అని? నాకు తెలిసీ తెలియని భాషలో ఇట్స్ ఎ బిగ్ మీటింగ్, ఇట్స్ కమింగ్, గ్యాదరింగ్, ఐ యామ్ గోయింగ్ టు మీటింగ్ సార్ అని అన్నా. వాళ్లకి అర్థం కాలేదు. బిగ్ గ్యాదరింగ్ అని అనకూడదట. దాంతో నన్ను ఎత్తుకెళ్లి పక్కనేసినారు టు అవర్స్. నాకు చెమట పట్టిపోయింది. అప్పుడు వాసుదేవరెడ్డి అనే డాక్టర్‌కు ఫోన్ చేసినా. ఏమి చెప్పాలని. బంధువుల ఇంటికి వచ్చినామని వాళ్లు చెప్పమన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో నేను అంత టెన్షన్ పడ్డా అమెరికాలో. నాతో పాటు వచ్చిన వాళ్లకు కూడా ఇంగ్లీష్ అంతంతే. ఇద్దరి పరిస్థితి ఒకటే’ అని అన్నారు. తిండి విషయంలోనూ అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పుకొచ్చారు. ‘అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చైనా పారిశ్రామిక దిగ్గజం టీసీఎల్ కంపెనీకీ ఓ స్థలం విషయానికి సంబంధించి ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు నా దగ్గరకు వచ్చారు. నాకొచ్చిందేమో బట్లర్ ఇంగ్లీష్. చైనీస్ ప్రతినిధులకు అనువాదం చేయడానికి వచ్చినామెకు ఫుల్‌గా ఇంగ్లీష్ వచ్చు. రెండు నిమిషాల పనికి మా మధ్య రెండు గంటల సమయం పట్టింది. చివరకు వాళ్ల హావాభావాలతో విషయం అర్థం అయ్యింది’ అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వివరించిన శైలితో అసెంబ్లీలో సభ్యులందరూ ఫక్కున నవ్వారు. -
నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
-
తిరుమల తరహాలో మరో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
ముక్కంటీశుడు మురిసేలా.. ఆధ్యాత్మిక ఆనందంతో భక్తులు విహరించేలా దక్షిణ కైలాసంలో మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. శ్రీకాళహస్తిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్న మాస్టర్ ప్లాన్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సంకల్పించారు. స్వర్ణముఖి నది నుంచి భక్త కన్నప్ప కొండ వరకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. సుందరీకరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా వాకింగ్ ట్రాక్, స్వర్ణముఖి నదికి ఇరువైపులా ఉద్యానవనాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. సాక్షి, తిరుపతి: తిరుమల తరహాలో శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్ అమలుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చించాలని భావించింది. అందులో భాగంగా ముక్కంటి ఆలయానికి పక్కనే ఉన్న సన్నిధి వీధిలోని 3.90 ఎకరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్థలంలో మొదటి విడతగా 212 నిర్మాణాలను సేకరించి.. వాటిని తొలగించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థల సేకరణకు రూ.99 కోట్లు కేటాయించారు. మొదటి విడతలో 186 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. మరో 26 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ స్థలాలకు, నిర్మాణాలకు సరైన ధర చెల్లించకుండా.. నిర్వాసితులకు న్యాయం చేయకుండా స్థలాలు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌కు తెలుగు తమ్ముళ్ల అడ్డు శ్రీకాళహస్తీశ్వర ఆలయ బృహత్తర ప్రణాళిక పనులకు గత ఏడాది మార్చిలో శ్రీకారం చుట్టారు. ఆరు మాసాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొందరు స్థానికులు, వ్యాపారులు పరిహారం పెంచకపోతే స్థలాలు ఖాళీ చెయ్యమని తేల్చిచెప్పారు. టీడీపీ నేతలు వారిని బెదిరించి బలవంతంగా ఖాళీ చేయించారు. సామాన్యులను ఖాళీ చేయించారు గానీ టీడీపీ నాయకుల వ్యాపార సముదాయాలు, భవనాలను తొలగించలేదు. వారు తమకు మాత్రం పరిహారం అదనంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానికులను ఖాళీ చెయ్యించే విషయంలో కీలకంగా వ్యవహరించిన స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి మాత్రం సన్నిధివీధిలో భిక్షాల గాలిగోపురం వద్ద తన స్థలాన్ని ఖాళీ చెయ్యకపోగా అందులో ఏకంగా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. టీడీపీ నేతల మోసపూరిత మాటలు నమ్మి ఖాళీచేసిన సామాన్యులు తెలుగు తమ్ముళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్త శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్‌పై పలుమార్లు సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ నిర్వాసితుల సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తి ఆలయం, స్వర్ణముఖి నది సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన గదుల కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయించారు. తిరుమల తరహాలో ఉచిత అన్నప్రసాదం అందివ్వనున్నారు. ఆలయం నుంచి అర్థనారీశ్వరాలయం వరకు రహదారి, రోడ్డుకు ఇరువైపుల వాకింగ్ ట్రాక్, ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చెయ్యనున్నారు. శ్రీకాళహస్తికి ప్రత్యేక ఆకర్షణగా భక్తకన్నప్ప తిప్పపై వంద అడుగులతో స్వామి, అమ్మవార్ల విగ్రహాలు ఏర్పాటు చేయదలిచారు. శ్రీకాళహస్తిలో నిర్వహించే కొండు చుట్టుకు ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని కొండ చుట్టూ పూలమొక్కలు, విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి పేరు చెబితే గుర్తుకు వచ్చే స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేసే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు. రెండు కి.మీ పరిధిలోని స్వర్ణముఖి నదికి ఇరువైపులా పూల మొక్కలు, వాకింగ్ ట్రాక్‌లు, భక్తులకు ఘట్టాలు నిర్మించనున్నారు. స్వర్ణముఖి నదిలోని మురికి నీటిని శుభ్రం చేసేందుకు వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచారు. శుద్ధి చేసిన నీటిని పట్టణ అవసరాలకు, వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అయితే మాస్టర్ ప్లాన్ పూర్తయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పేరొస్తుందని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడినా మాస్టర్ ప్లాన్ అమలుచేసి తీరుతామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. మాస్టర్ ప్లాన్ ముందుకే శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గత వారంలో కలెక్టర్, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ సమస్యకు దాదాపు పరిష్కారం దొరికింది. త్వరలోనే పనులు ప్రారంభించి ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. – రామస్వామి, కార్యనిర్వహణాధికారి శ్రీకాళహస్తీశ్వరాయలం -
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్
అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తిపలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్వే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్ర యం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడానికి ఆసక్తిచూపుతున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయు డు కండ్రిగ మండలాల పరిధిలోని మొ త్తం 34 గ్రామాల్లో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన భూముల సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తరంలో 11వేల ఎకరాలు, దక్షిణంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు. పర్యావరణానికి ముప్పు లేకుండా జాగ్రత్తలు పర్యావరణానికి ముప్పు వాటిల్ల్ల కుండా ఎక్కడా చెరువుల జోలికి వెళ్లకుండా జనావాసానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా రెండు పంటలు పండే భూములను కూడా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పంటలు పండే భూములకు కండలేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,507 కోట్లు కేటాయించినట్లు ఆర్డీఓ కనకనరసారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించనుంది. భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతే పరిహారం పంపిణీ చెయ్యనుంది. దీంతో పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉం డవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పూర్తయితే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. సీఎం సాహసోపేత నిర్ణయం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం చెయ్యడం సాహసోపేత నిర్ణయం. సీఎం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా వారి కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని!
తిరుపతి: వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో సహా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో లేపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీని కోరారు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోలేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. 'ఆలయంలో పాలనా వైఫల్యాలపై మాకు సూచనల వరకు ఒకే గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు' అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేయగా.. బృందమ్మ మాత్రం అదే తీరుగా వ్యవహరించడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. తరచుగా టీడీపీ నేతలు, మంత్రులు.. వారి సన్నిహితులు మహిళలు, అధికారులపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. -
మన్నవరంలో నేడు భారీ బహిరంగ సభ
తిరుపతి: మన్నవరంలో బెల్ ప్రాజెక్ట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఆదివారం ఆయన చేపట్టిన పాదయాత్ర మన్నవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు మన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నేటి మధ్యాహ్నానికి మన్నవరం చేరుకుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చిత్తూరు జిల్లాలోని మన్నవరంలో బెల్ ప్రాజెక్టును తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
'బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలి'
తిరుపతి: చిత్తూరు జిల్లా మన్నవరంలో బెల్ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి సాధించారని వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. మన్నవరం బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’
తిరుపతి లీగల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి బెంగుళూరులో ఉండడానికి అనుమతి ఇస్తూ తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బియ్యపు మధుసూదన్ రెడ్డికి గత నెల 27న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన నెలరోజుల పాటు నెల్లూరులోనే వుండాలని న్యాయమూర్తి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు బెంగుళూరులో ఉన్నారని, ఆరోగ్యరీత్యా తాను బెంగుళూరు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి తిరుపతి కోర్టులో పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఆయన బెంగుళూరు వెళ్లడానికి అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మిథున్ రెడ్డికి బెయిల్
చిత్తూరు: రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడా కూడిన బెయిల్ ఇచ్చింది. నెల రోజుల పాటు నెల్లూరు జిల్లా విడిచి వెళ్లరాదని.. చిత్తూరు జిల్లాలో ఎక్కడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని షరతులు విధించింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ ఇన్ చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేణిగుంటలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం, నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలో వారు రిమాండ్ అనుభవిస్తుండడం తెలిసిందే.