తిరుపతి: చిత్తూరు జిల్లా మన్నవరంలో బెల్ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి సాధించారని వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసూదన్రెడ్డి తెలిపారు. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో వేలాది మంది ఉద్యోగులు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. మన్నవరం బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలంటూ బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది.