
సాక్షి,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు.
సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘వచ్చే ఏడాది పాదయాత్ర బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడేమే లక్ష్యం. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దే అధికారం’ అని ధీమా వ్యక్తం చేశారు.
మరోసారి కేసీఆరే సీఎం
అంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.
ఎస్‌ఎల్‌బీసీలో విషాదం.. చేపల కూర తింటున్న మంత్రులు
ఎస్‌ఎల్‌బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్‌పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్‌కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment