
సాక్షి, ఏర్పేడు(చిత్తూరు): సదాశివపురం కోన వాగు ప్రవాహంలో చిక్కుకున్న 11మంది గిరిజనులను రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరికి రక్షించడానికి శుక్రవారం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి స్వయంగా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఇద్దరు వాగులో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది వారిని రక్షించారు. చదవండి: (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన)
Comments
Please login to add a commentAdd a comment