yerpedu
-
ఏర్పేడు-శ్రీకాళహస్తి సీఎం జగన్ రోడ్ షో
-
బస్సు యాత్ర జనసంద్రం
-
వాగులో చిక్కుకున్న 11 మంది సురక్షితం..
సాక్షి, ఏర్పేడు(చిత్తూరు): సదాశివపురం కోన వాగు ప్రవాహంలో చిక్కుకున్న 11మంది గిరిజనులను రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరికి రక్షించడానికి శుక్రవారం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి స్వయంగా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఇద్దరు వాగులో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది వారిని రక్షించారు. చదవండి: (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన) -
వనజాక్షిపై దాడి జరిగినప్పుడే చర్యలుంటే..
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుక మాఫియా అవతారమెత్తారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గతంలో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకొని ఉంటే.. ఏర్పేడు ఘటన జరిగేది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ధనదాహమే ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైందని నారాయణ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీపై హత్యానేరం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
'ఏర్పేడు ప్రమాదంలో కుట్రకోణం'
-
మర్రి వినాయకుడు
మర్రి వినాయకుడు చిత్తూరు జిల్లా ఏర్పేడు వుండలంలోని పెద్దఅంజిమేడు చెరువు కట్టకింద ఉన్న మర్రి చెట్టుకు వినాయకుని రూపంలో ఊడలు దిగాయి. చెట్టు మెుదలు భాగంలో తొండం, కళ్లు ఆకారంలో ఊడలు ఉన్నాయి. పైగా ఈ చెట్టు పక్కనే వినాయకస్వామి ఆలయం ఉండడంతో సాక్షాత్తూ గణనాథుడే ఈ రూపంలో దర్శనమిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. -
ముగ్గురు దొంగలు అరెస్ట్: బైక్‌లు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.