
మర్రి వినాయకుడు
మర్రి వినాయకుడు
చిత్తూరు జిల్లా ఏర్పేడు వుండలంలోని పెద్దఅంజిమేడు చెరువు కట్టకింద ఉన్న మర్రి చెట్టుకు వినాయకుని రూపంలో ఊడలు దిగాయి. చెట్టు మెుదలు భాగంలో తొండం, కళ్లు ఆకారంలో ఊడలు ఉన్నాయి. పైగా ఈ చెట్టు పక్కనే వినాయకస్వామి ఆలయం ఉండడంతో సాక్షాత్తూ గణనాథుడే ఈ రూపంలో దర్శనమిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.