vinayakudu
-
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
కృష్ణుడు నవ్వడు. తెగ నవ్విస్తాడు. కృష్ణుడు అమాయకంగా కనిపిస్తాడు. కానీ అల్లరల్లరి చేస్తాడు. ‘అయ్ బాబోయ్... మా రాజోలులో ఇలా కాదండీ’ అనేది ‘వినాయకుడు’ సినిమాలో కృష్ణుడి మార్క్ డైలాగ్. కృష్ణుడు నటుడు మాత్రమే కాదు ్రపొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ‘కూడా’కు మరో ‘కూడా’ కలిపితే వంటలు చేయడంలో దిట్ట కూడా! కృష్ణుడు కోనసీమ బిడ్డ. ఉమ్మడి కుటుంబాల విలువ తెలిసిన కృష్ణుడు ఈస్ట్, వెస్ట్ స్పెషల్ పాకుండల గురించి నోరూరించేలా చెబుతాడు. అంతేనా! ‘అయ్ బాబాయ్. మా రాజోలులో అలా కాదండి. ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ఎలా చేయాలో కూడా చెబుతామండీ’... మరి ఆయన మాటల్లోనే... పాకుండలు, పెద్ద చెగోడీలతో పాటు... తన స్వీట్ ఫ్యామిలీ కబుర్లు...కనుల పండగ చేసే రంగవల్లులే కాదు... సంక్రాంతి అంటే కమ్మని కర కరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ్రపాంతానికి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. పెద్ద పండగ రోజు ఆ కరకరల స్వరాలు వినాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న గీతాభాస్కర్ చేసే సకినాల రుచి ఇంతా అంతా కాదు. కృష్ణుడు అంటే అల్లరి. వెండితెర కృష్ణుడు అంటే నవ్వుల సందడి. కోనసీమ బిడ్డ కృష్ణుడు పాకుండల గురించి చెబితే తీయగా నోరూరాల్సిందే. తమకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పడమే కాదు... ఎలా చేయాలో కూడా చెబుతున్నారు గీతాభాస్కర్, కృష్ణుడు. ఆ కబుర్ల కరకరలు... కృష్ణుడు: ట్రెడిషనల్ పిండి వంటలు చేయడం అనేది నాకు చిన్నప్పుడు అలవాటు. మా అమ్మ చేసేవారు. అలాగే మా ఇంట్లో సుబ్బయ్య అని కుక్ ఉండేవారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. బియ్యం నానబెట్టి, తర్వాత ఆరబెట్టి, దంచేవాళ్లు. నా చిన్నప్పుడు బాగా గుర్తున్నది అంటే ఇదే. ఇప్పుడంటే మిషన్‌లో పిండి ఆడిస్తున్నారు కానీ అప్పట్లో దంచడమే. మన చిన్నప్పుడు మనం తిన్నంత టేస్టీగా ఇప్పుడు ఉండటంలేదు. చిన్నప్పుడు టేస్ట్ చూశాం కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్‌కి ఆ తేడా తెలియదు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి రోజుకొక ఇంటికి అన్నట్లు వండేవారు. అది చాలా బాగుండేది.మాకు పాకుండలు ఫేమస్మేం ఈ సంక్రాంతికి పాకుండలు చేశాం. మాకు అదే ప్రత్యేకత. ఈస్ట్, వెస్ట్‌లో సంక్రాంతికి పాకుండలు ఫేమస్. విడిగా పెద్దగా చేయరు. ఈ పండగకే చేస్తుంటారు. అరిసెల పిండి ఫార్మాట్లోనే పాకుండల పిండి కూడా ఉంటుంది. బియ్యాన్ని ఓ రోజంతా కానీ 30 గంటలు కానీ నానబెట్టి, పిండి పట్టించుకోవాలి. బెల్లం పాకం పట్టి చేసుకోవాలి. పాకం సరిగ్గా కుదరడానికి కొలతలు ముఖ్యం. నాలుగు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల బెల్లం వాడాలి. ఒక అరగ్లాసు నీళ్లు పోసి, పాకం పట్టాలి. పాకుండలలో కొబ్బరి ముక్కలు వేస్తారు. అది టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి అరిసెలు ఉంటాయి కానీ కోనసీమ జిల్లాల్లో పాకుండలనే ప్రిఫర్ చేస్తారు.ఆ మంచు... అదో అందంచిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ఇరుగుపొరుగు కలిసి పిండి వంటలు వండుకోవడం... ఊర్లో ఇలాంటి సందడి ఉండేది. ఇప్పటికీ ఊళ్లో ఉన్నాయి. కానీ సిటీలో అంత సందడి కనిపించదు. చిన్నప్పుడు ఆ మంచులో భోగి మంటలు వేయడం, హరిదాసులు రావడం, పెద్ద పెద్ద ముగ్గులు చూడటం... అంతా ఓ అందంగా ఉండేది. అదో మంచి అనుభూతి. సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి మంటలు అవి వేస్తారు కానీ ఊళ్లో ఉన్నంత సందడి ఇక్కడ కనిపించదు. అందుకే చాలామంది పండగలకి ఊరు వెళ్లిపోతుంటారు. నేను కూడా వీలున్నప్పుడల్లా వెళుతుంటాను. మా పాపకి ఆ కల్చర్ తెలియాలని తనని కూడా తీసుకెళుతుంటాను. ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీల్లో స్థిరపడుతున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది పండగకి ఊరికి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అంటే అందర్నీ కలిపే పండగ. బయటి ఫుడ్ తినదుమాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ (లలితా గాయత్రి) వాళ్లది నిజామాబాద్. ఆ వంటల స్టయిల్ వేరు. ఏ ్రపాంతం రుచి ఆ ్రపాంతానిది. నేను బేసిక్‌గా ఫుడ్ లవర్ని. బాగా వండిన ప్రతిదీ నాకు ఇష్టం. ఇక మా ఆవిడకి కూడా పాకుండలు చేడయం వచ్చు. నిజానికి పెళ్లయ్యాక నేను వంట చేయడం మానేశాను. అయితే అప్పుడప్పుడూ చేస్తుంటాను. ఈ పండగకి నేనే చేశాను... తను పక్కనే ఉండి, కాస్త హెల్ప్ చేసింది. మా పాపకు నచ్చిన పిజ్జా, గార్లిక్ బ్రెడ్ అవన్నీ కూడా చేస్తుంటాను. మా పాప బయటి ఫుడ్ దాదాపు తినదు. ఇంట్లోనే చేసి పెడతాం.పండగకి పెద్ద చెగోడీలూ చేస్తాంసంక్రాంతికి మేం పాకుండలతో పాటు పెద్ద చెగోడీలు చేస్తుంటాం. మా రాజోలులో ఈ చెగోడీలు ఫేమస్. కారపొ్పడితో చేస్తాం. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఊరెళ్లినప్పుడుల్లా తింటాను. ఇప్పుడు పాకుండలతోపాటు అవి కూడా వండాను. చెగోడీలకు కూడా బియ్యం పిండినే వాడతాం. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసు నీళ్ల రేషియోతో చేయాలి. పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర... మూడూ నూరి, వేడి నీళ్లలో కలిపి, ఉప్పు వేసి, అందులో బియ్యం పిండి వేసి, కలపాలి. ఆ తర్వాత చెగోడీలను లావుగా వత్తి, పెసరపప్పు అద్ది, నూనెలో వేసి వేయించుకోవాలి. -
పండగ కిక్కు.. కొత్త లుక్కు
వినాయక చవితికి వినాయకుడికి విభిన్న రకాల వంటకాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాగే ఈ పండక్కి వినాయకుడిని స్మరించుకుంటూ ‘పండగ కిక్కు..కొత్త లుక్కు’ అంటూ కొందరు సినిమా యూనిట్ వారు పలు రకాల అప్డేట్స్ ఇచ్చారు. వీటిలో కొన్ని ఈ విధంగా.. బీచ్‌లో సైంధవ్ బీచ్‌లో సేద తీరు తున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూ΄పొందుతున్న ‘సైంధవ్’ కొత్త పొస్టర్ విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా నటిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, బాల నటి సారా కీలక పా త్రధారులు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్. వీడు టైగర్... రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పా ట ‘వీడు..’ను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, రవితేజ పొస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. రామ్.. కల్ట్ మామా ‘బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డూ చిల్లి సాల్టు..’ అంటూ సాగే పా ట ‘స్కంద’ చిత్రంలోనిది. రామ్ హీరోగా బోయపా టి శ్రీను దర్శకత్వంలో రూ΄పొందుతున్న చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లు. ఈ సినిమాలో రామ్, ఊర్వశీ రౌతేలా కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం ‘కల్ట్ మామా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా హేమచంద్ర, రమ్య బెహ్రా, మహా పా డారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ల సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. టీజర్ రెడీ ‘యానిమల్’ మూవీ టీజర్ రెడీ అవుతోంది. ఈ నెల 28న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ పొస్టర్‌ను విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మది దోచేసిందే... ‘మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా...’ అంటూ హీరో కల్యాణ్ రామ్ పా డారు. కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ నటిస్తున్న ‘డెవిల్’లోని పా ట ఇది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబరు 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ పా ట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరకల్పనలో ఆర్వీ సత్య రాసిన ఈ పా టను సిధ్ శ్రీరామ్ పా డారు. దేఖో ముంబై దోస్తీ మజా... కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘దేఖో ముంబై దోస్తీ మజా..’ పా ట లిరికల్ వీడియోను హీరో రవితేజ రిలీజ్ చేశారు. అమ్రిష్ గణేష్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్, మేఘ్ ఉట్– వాట్ సాహిత్యం అందించగా, అద్నాన్ సమీ, పా యల్ దేవ్ ఈ పా టను పా డారు. అంజనాద్రిలో... తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన ‘హను–మాన్’ పొస్టర్ రిలీజైంది. ‘‘అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో ఈ సినిమా ఉంటంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం
కరోనా మహమ్మారితో విలవిల్లాడిపోయి గత రెండేళ్లుగా గణేశుడి ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్–19 భయాలు అంతగా లేకపోవడం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలకి పూర్తిగా అవగాహన రావడంతో హరిద్వార్ నుంచి భువనేశ్వర్ వరకు పెద్ద ఎత్తున విఘ్నాధిపతిని కొలవడానికి ఏర్పాట్లు చేశారు. ఏనుగు తలతో పిల్లల్ని ఆకర్షించే రూపురేఖలతో గణపతి బప్పా కొలువై ఉండడం ఈ పండుగకి విదేశాల్లో కూడా ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గణేశుడిపై అధ్యయనం చేసిన కాలిఫోర్నియా ప్రొఫెసర్ రాబర్ట్ ఎల్ బ్రౌన్ ఆగ్నేయాసియాలో 5, 6 శతాబ్దాల్లోనే గణేశుడి ప్రతిమలు శాసనాల్లో కనిపించాయని వెల్లడించారు. పలు ఆసియన్ దేశాల్లో బొజ్జ గణపయ్య ఆరాధన ఎప్పట్నుంచి ఉందో ఆ ప్రొఫెసర్ ఒక ఆరి్టకల్‌లో వివరించారు. భారత్‌లో 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పుణెలో 18వ శతాబ్దంలో పెషావర్లు గణపతి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఇక స్వాతంత్య్ర పోరాటం సమయంలో హిందువులందరినీ ఏకం చెయ్యడానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఊరేగింపుల్ని దేశవ్యాప్తం చేశారు. కాంబోడియా: 7వ శతాబ్దం నుంచే కాంబోడియా ప్రజలు గణేశుడ్ని ప్రథమ దేవుడిగా తొలి పూజలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఆలయాలన్నీ వినాయకుడికే అంకితమిచ్చారు. భారత్‌లో గణేశ్ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందే కాంబోడియాలో గణపతిని కొలడం విశేషం. ఈ దేశంలో గణేశ్ ప్రతిమలు ఎక్కువగా నిల్చొనే భంగిమలో మాత్రమే ప్రతిíÙ్ఠస్తారు. కొన్ని కూడళ్లలో కూడా భారీ సైజులో గణేశుడి విగ్రహాలు కనిపిస్తాయి. థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌లో 10వ శతాబ్దం నుంచే గణపతిని కొలుస్తారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళం, థాయ్ భాషల్లో రాసిన శాసనాలపై కంచుతో తయారు చేసిన గణేశుడి ప్రతిమ ఫాంగ్ నా ప్రాంతంలో లభించింది. ఈ దేశంలో వ్యాపారస్తులు గణేశుడిని ఎక్కువగా పూజించి బంగారం, మిఠాయిలు సమర్పిస్తూ ఉంటారు. విజయ గణపతిగా కీర్తిస్తారు. సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన చాకోఎంగ్సావో నగరం గణేశుడి నగరంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ గణేశుడికి 3 ఆలయాలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని సెంట్రల్ వరల్డ్ ఎదురుగా గణేశుడి మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. థాయ్ ప్రభుత్వంలోని ఫైన్ ఆర్ట్స్ శాఖ చిహ్నంగా గణేశుడే ఉండడం విశేషం. చైనా: చైనాలో గణేశుడి పురాతన విగ్రహం తన్ హువాంగ్ ప్రాంతంలోని తవ్వకాలలో బయటపడింది. కుంగ్ హుస్సేన్ ప్రాంతంలోని గణేశుడి ఆలయం ఉన్నాయనడానికి 531 కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో గణేశుడి ఒక నెగిటివ్ ఫోర్స్‌గా చూస్తారు. ఏదైనా పనికి అవరోధంగా నిలిచేవాడిగానే చిత్రీకరిస్తూ ఉంటారు. జపాన్: జపాన్‌లో 8వ శతాబ్దంలోనే గణేశుడిని పూజించినట్టు ఆధారాలున్నాయి. అత్యంత శక్తిమంతుడైన దేవుడిగా చూసేవారు. వ్యాపారులు, జూదగాళ్లు, కళాకారులు ఎక్కువగా గణేశుడిని ఆరాధించేవారు. బౌద్ధ ఆరామాలలో గణేశుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌కి సమీపంలో గార్జెడ్లో 7–8 శతాబ్దాల్లోనే గణేశుడి విగ్రహం లభ్యమైంది. ఇండో ఆఫ్గాన్ మధ్య సంబంధాలకు ప్రతీకగా ఈ గణేశుడు ఉండేవాడని పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పారు. టిబెట్: టిబెటన్ బుద్ధిజంలో కూడా గణేశుడి ఆరాధన ఉంది. 11వ శతాబ్దంలో తొలిసారిగా వినాయకుడిపై భారతీయ రచనలు ఎన్నింటినో టిబెటిక్ భాషలోకి అనువదించారు. టిబెట్ పురాణాల్లో కూడా గణేశుడి ప్రస్తావన ఉంది. లామాయిజం వ్యాప్తిలో గణేశుడ్ని కూడా వినియోగించుకున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: గణేష్.. జోష్ -
కూల్ నాయక్
లార్డ్‌లా ఉండడు గణేశుడు. మనం ఉండనివ్వం కదా..! ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకుంటాం. క్రికెట్ టీమ్‌లోకి తీసుకుంటాం. ‘గురూ లిఫ్ట్..’ అనీ అడగగలం. మనలాగే.. ఓ మనిషిలాగే.. హ్యూమన్–ఫ్రెండ్లీ గాడ్! ప్రసన్నవదనుడు. కోపమెరుగని కూల్ నాయక్. నాయకుడు గంభీరంగా ఉంటాడు. తీక్షణమైన అతడి చూపుకే అరికాళ్లు చల్లబడిపోతాయి. మాటకైతే వెన్ను ఝల్లుమంటుంది. ‘దళపతి’లో రజనీకాంత్ నాయకుడు. ‘నాయకుడు’లో కమల్ హాసన్ నాయకుడు. గణపతి దగ్గరున్న చనువు దళపతి దగ్గర ఉండదు మనుషులకు. వినాయకుడి దగ్గరుండే చొరవ నాయకుడి దగ్గర ఉండదు. వీర గణపతి, శక్తి గణపతి, మహా గణపతి.. తక్కిన ఏకవింశతి గణపతుల్నీ (21 మంది), అవాంతర భేద గణపతుల్నీ (11 మంది) బాలగణపతిలానే భావించి ఆయనతో ఆటలు ఆడతాం. ‘పోనీలే.. పిల్ల గ్యాంగ్..’ అనుకుంటాడేమో బాస్! ఆయన ముందు ఎన్ని వేషాలు వేసి, ఆయన చేత ఎన్ని వేషాలు వేయించినా వేడుక చూస్తుంటాడు తప్ప, రజనీకాంత్‌లా.. ‘వీడు సూర్యా.. రెచ్చగొట్టకండి’ అని మండపంలోంచి లేచి, చూపుడు వేలెత్తి వార్నింగ్ ఇవ్వడు. కమల్‌హాసన్‌లా.. ‘ఏయ్.. ఎవడికి తెల్సు వాడిల్లు. ఎవడికి తెల్సు? ఏయ్ సామీ నీకు తెలుసా?’ అని ఆరా తియ్యడు.. పంచె పైకి ఎగ్గట్టి. ఎన్ని అవతారాలు ఉన్నా.. భక్తుల దగ్గర మాత్రం ఆయన ‘కూల్’నాయకే. ప్రసన్న గణపతి. నిధీ శర్మ అని ఒక అమ్మాయి ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటుంది. ఈసారి చాక్లెట్ గణపతిని పెట్టుకుంది! ఎవరైనా అడిగితే వాళ్లకు కూడా చిన్న చిన్న చాక్లెట్ గణపతుల్ని తయారుచేసి ఇస్తోంది. విఘ్నేశ్వరుడితో తనకు ఏనాటి నుంచో ఎకో–ఫ్రెండ్షిప్ ఉందని అంటోంది. ప్రతి వినాయక చవితికీ ఏకదంతుణ్ణి కెమికల్ రహితుడిగా సృష్టించుకుని, పూజించుకుని నీళ్లలో నీటిలా గంగమ్మ తల్లి ఒడిలో వదిలేస్తుందట. మరి ఈసారి చాక్లెట్ వినాయకుడు కదా! నీటిలోనే కలిపేస్తుందా? లేదు. పాలలో కలిపి బాగా షేక్ చేసి.. చుట్టుపక్కల వాళ్లందరికీ ప్రసాదంలా పంచిపెట్టబోతోంది! ‘‘ఆ ప్రసాదం ఒంట్లోకి వెళ్లి సర్వ రోగాల నుంచి నిరోధకత ఇస్తుంది’’ అని నమ్ముతోంది నిధీ శర్మ. శాస్త్రం అంగీకరిస్తుందా? అది తెలియదు కానీ, వినాయకుడు మాత్రం అనుగ్రహించకుండా ఉండడు. భక్తుల్ని ఆయన ఒక్కనాడైనా ఆగ్రహించినట్లు రుగ్వేదంలో లేదు, శైవ సంప్రదాయంలో లేదు, గణేశ ముద్గల బ్రహ్మాండ బ్రహ్మ పురాణాలలోనూ లేదని అంటారు. కనుక ఆ చాక్లెట్ భక్తురాలికి ఆయనిచ్చే వరాలేవీ సంఖ్య తగ్గిపోవు. ఆమెలాగే.. ముంబైలోని ఘట్కోపర్లో ఒకాయన ఈయేడు డిఫరెంట్‌గా శానిటైజర్ గణేశ్‌ని ప్రతిష్టించాడు. ఆ స్వామి వారి విగ్రహం దగ్గరకు వెళ్లి చేతులు జోడించే ముందు.. ఆయన అభయహస్తం నుంచి శానిటైజర్ వచ్చి అరిచేతుల్లో పడుతుంది! సెన్సర్లు బిగించిన టెక్–గణేశ్ ఆయన. ‘కనీస జాగ్రత్త గణపతి’. మట్టి ముద్దతో ఏమైనా చేయొచ్చు. అలాగే భక్తితో వినాయకుడికి ఎలాంటి ఆకృతినైనా తేవచ్చు. సరళసాధ్యుడు (ఫ్లెక్సిబుల్) కనుకే పిల్లల చేతిలో ‘క్లే’ లా.. బహురూప, భావస్వరూప మూర్తి అయ్యాడు. అడుగుల్ని పెంచినా, తగ్గించినా ఏమనడు గజాననుడు. అసలైతే మట్టితో చేయాలి ఆయన రూపాన్ని. అదొదిలి హంగుల్ని దిద్దినా.. తెలుసుకుంటార్లే అని వదిలేస్తాడు. ఇప్పుడు మండపాలు పెట్టడానికి, పదిమంది చేరడానికి వీల్లేకపోయాక.. తెలిసి రాకుండా ఉంటుందా? చేతుల్లో పట్టేంత మట్టి గణపతి ప్రతిమను ఇళ్లల్లో పెట్టుకుంటున్నాం ఈసారి. మంచికే. ఆరోగ్య సిద్ధి గణపతికి ప్రణామాలు. ఘట్కోపర్లోని శానిటైజర్ గణేశుడు -
వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండపాల్లో కొలువైన గణనాథుడికి భక్తులు పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే అన్నదానాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు. -
‘గణ’ వైభవం
ఘనంగా గణనాథునికి స్వాగతం నవరాత్రోత్సవాల్లో సుమారు రూ.30 కోట్ల ఖర్చు అంబరాన్నంటిన పండుగ సంబరాలు ఆదిలాబాద్ : గణనాథునికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వేలాది గణపతి మండపాలు వెలిశాయి. నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. చవితి వైభవం జిల్లా అంతటా కనిపిస్తోంది. పండుగకు సుమారు రూ.30 కోట్లకు పైగా జిల్లా ప్రజలు వెచ్చించినట్లు అంచనా. మండపాల ఏర్పాటు, గణనాథుల కొనుగోళ్లు, మిఠాయిలు, బ్యాండ్‌మేళాలు, పూజసామగ్రి, వాహనాల్లో తరలింపు.. ఇలా పండుగను ఖర్చుకు వెనుకాడకుండా జిల్లా ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రోత్సవాలు కాంతులీననున్నాయి. పోటాపోటీగా మండపాల ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికిపైగా భారీ గణనాథులు, గ్రామాల్లో, పట్టణాల్లో మరో వెయ్యి చిన్న గణపతులు మండపాల్లో కొలువుదీరాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్‌పేట్ ప్రతీ ఏడాది నూతి(బావి)పై ఏర్పాటు చేసే గణనాథుడిని అదే స్థలంలో తయారు చేశారు. ఎదురుగా విష్ణుమూర్తి భారీ సెట్టింగ్‌తో, లోపల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారు కోసం రూ.4 లక్షలు వెచ్చించారంటే మండపాల ఏర్పాటులో నిర్వాహకులు ఖర్చుకు వెనుకాడడం లేదని స్పష్టమవుతోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి భారీ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. మామూలు మండపం నవరాత్రుల ఖర్చు రూ.లక్షకు పైగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన చిన్న, పెద్ద మండపాలన్ని కలిపి వినాయక చవితి కోసం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వెచ్చించారని స్పష్టమవుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా పట్టణాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటు పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి ప్రాంతాల్లోనూ ఒకరకమైన ఉత్సాహం ఉంటుంది. పండుగ సందడి.. జిల్లా అంతటా సోమవారం వినాయక చవితి సందడి కనిపించింది. ఉదయం నుంచే పట్టణాల్లో ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో వినాయక విగ్రహాల కొనుగోళ్లు, పూజసామాగ్రి, మిఠాయిల కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రెండు టన్నుల మిఠాయిల విక్రయాలు జరిగినట్లు మిఠాయి దుకాణాలు యజమానులు తెలుపుతున్నారు. ఇలా లక్షల రూపాయలు మిఠాయిల కోసమే వెచ్చించారు. పూజసామగ్రి కోసం రూ.2 కోట్ల వరకు వెచ్చించారు. మండపాల ఏర్పాటు, అలంకరణ, గణనాథుని తరలించేందుకు వాహనాల కిరాయి, బ్యాండ్ మేళాల కోసం కోట్లలో నిర్వాహకులు ఖర్చు చేశారు. మండపాలను అందంగా తీర్చిదిద్దారు. వివిధ ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవరాత్రోత్సవాలు ప్రజలకు సుఖఃసంతోషాలు కలుగాలని కోరుకుంటున్నారు. -
జైజై గణేశా..
-
ఏకశిల వినాయక మండపం
ఆళ్లగడ్డ: పట్టణంలో శిల్పకళాకారులు తయారు చేసిన ఏకశిల వినాయక మండపం ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..వినాయక చవితికి ప్రతిష్టించుకునేలా ఒకే రాతి మండపం..అందులో వినాయక విగ్రహం తయారుచేసి ఇవ్వాలని శిల్పకళా సమితి సభ్యులను సంప్రదించారు. దీంతో శిల్పి జాఫర్ సుమారుగా ఏడాది పాటు కష్టపడి ఈ మండపాన్ని తయారు చేశారు. మండపం 11. 6 అడుగల ఎత్తు, 8 టన్నుల బరువు ఉందని జాఫర్ తెలిపారు. వినయక చవితి రోజు ప్రతిష్టించుకునేందుకు శనివారం ప్రత్యేక వాహనంలో దీనిని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లారు. -
ఎన్నెన్నో రూపాలు
వెయ్యికి పైగా వినాయక రూపాలు సేకరణ ఆల్బమ్‌లో భద్రపరిచిన వెంకటేశ్వర్లు కమాన్‌చౌరస్తా : ఆకులు.. పండ్లు.. రాళ్లు.. నవధాన్యాలు..కరెన్సీ..వజ్రాలు..గంధం..కాగితాలు ఇలా ఎందెందు కొలిచినా అందందూ కలడు అన్నట్లు వినాయకుడి అన్ని రూపాల్లో కనిపిస్తుంటాడు. విజ్ఞాలను తొలగించి మెుదటి పూజను అందుకునే ఆది దేవుడు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తుంటాడు. గణేశ్ రూపాలను సేకరించే పనిలో పడ్డారు కరీంనగర్‌కు చెందిన కర్నబత్తుల వెంకటేశ్వర్లు. ఆయన ఆధ్యాత్మిక ఆసక్తిపై ప్రత్యేక కథనం. పదేళ్లుగా.. కరీంనగర్లో టాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు 2007 నుంచి ఇప్పటివరకు వినాయకుడి రూపాలను సేకరించే పనిలోనే ఉన్నారు. వెయ్యి రూపాలను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకోగా..దాన్ని పూర్తి చేశారు. శుభలేఖలు, దినపత్రికలు, పోస్టర్లు, వివిధ మ్యాగజైన్లు, వివిధ యాత్రల్లో లభించిన రూపాలన్నింటిని భద్రపరుస్తూ ఆల్బమ్ తయారు చేశారు. కొత్త రూపం కనిపిస్తే భద్రపరుస్తుంటారు. వివిధ తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలోనూ అక్కడ కొత్త రూపంలో వినాయకుడి ఫొటోలు కనిపిస్తే చాలు కొని తన దగ్గర భద్రపరుచుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్లి అక్కడ వందకుపైగా వినాయకుడి రూపాలను సేకరించారు. భిన్నరూపాలు వెంకటేశ్వర్లు సేకరించిన వినాయకుడి చిత్రాల ఆల్బమ్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. కరెన్సీ, వజ్రాలు, మట్టి, గంధం, రాళ్లు, కాగితాలు, బియ్యం, గవ్వలు, నవధాన్యాలతో తయారు చేసిన వినాయకులతోపాటు పంచముఖ రూపం, శివుని రూపం, బాలగణేషులతోపాటు ఎన్నో సుందర రూపాలు ఉన్నాయి. లక్ష్యాన్ని చేరుకున్నాను –కె.వెంకటేశ్వర్లు, టాక్స్ కన్సల్టెంట్ వినాయకుడంటే చిన్నప్పటి నుంచి అమితి భక్తితో ఉండే వాడిని. గణేశుడి రూపాలను పరిశీలిస్తే చాలా రకాలుగా ఉండడంతో ఆసక్తి కలిగింది. 2007 నుంంచి ఇదే పనిలో ఉన్నాను. వెయ్యి రకాలు సేకరించాలనే లక్ష్యం పెట్టుకోగా..అంతకుమించి లభిస్తుండడంతో సేకరిస్తూనే ఉన్నాను. -
అల్లం వినాయకుడు
యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. -
మర్రి వినాయకుడు
మర్రి వినాయకుడు చిత్తూరు జిల్లా ఏర్పేడు వుండలంలోని పెద్దఅంజిమేడు చెరువు కట్టకింద ఉన్న మర్రి చెట్టుకు వినాయకుని రూపంలో ఊడలు దిగాయి. చెట్టు మెుదలు భాగంలో తొండం, కళ్లు ఆకారంలో ఊడలు ఉన్నాయి. పైగా ఈ చెట్టు పక్కనే వినాయకస్వామి ఆలయం ఉండడంతో సాక్షాత్తూ గణనాథుడే ఈ రూపంలో దర్శనమిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. -
ఖైరతాబాద్‌లో బారులు తీరిన భక్తులు
-
ఖైరతాబాద్‌లో బారులు తీరిన భక్తులు
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. మహానగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తున్నారు. ఇప్పటికే సుమారుగా వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. భక్తులకు దర్శనార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. అదే విధంగా రక్షణ చర్యలు కూడా చేపట్టినట్టు చెప్పారు. -
సిద్ధమవుతున్న 'బాహుబలి'
త్వరలో వచ్చే వినాయక చవితికి ....గణనాధుడు సిద్ధం అవుతున్నాడు. సీజన్ బట్టి అన్నట్లుగా... విగ్రహాలు తయారు చేసేవాళ్లు కూడా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సూపర్ హిట్ సినిమాల్లో హీరోలుగా నటించిన వారిలా వినాయకుడి విగ్రహాలను రూపొందించడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. గతంలో అపరిచితుడు, మగధీర, ఈగ, రోబోగా ...గణనాధులను రూపొందించిన తయారీదారులు ఈసారి.. ఆ క్రేజ్‌ను ఒడిసిపట్టుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న 'బాహుబలి' చిత్రంలో హీరో ప్రభాస్ ...శివలింగాన్ని ఎత్తే దృశ్యాన్ని ప్రేరణగా తీసుకుని వినాయకుడిని బాహుబలిగా రూపుదిద్దుతున్నారు. వారి చేతుల్లో బాహుబలి మెరుగులు దిద్దుకుంటున్నాడు. అయితే ఈ బాహుబలుడు తయారయ్యేది ...రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదండోయ్... మహారాష్ట్రలోని షోలాపూర్ లో తయారు కావటం విశేషం. -
విశేషాలు సమూహం వినాయక స్వరూపం
29న వినాయక చవితి పర్వం:‘దైవం గురించి సందేహంతో ఓ ప్రశ్నని వేయడమా?’ అనుకుంటూ లెంపలు వేసుకుని, ఆ సందేహాన్ని అలాగే లోపల నొక్కి ఉంచుకున్నంత కాలం మనకి ఆ దైవం గూర్చిన ఏ విశేషమూ అర్థం కాదు. సంప్రదాయం తెలియదు. మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తీ మనకి రాదు. కాబట్టి ఎన్ని సందేహాలొస్తే అన్ని సమాధానాలని పొందుతూ ఉంటే, అంతగానూ మనం ఆ దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాల్నీ సమాధానాల్నీ చూద్దాం! వినాయకుడి రూపం కనపడగానే, ‘శుక్లాం బరధరం విష్ణు’మ్మంటూ శ్లోకాన్ని చదివేసి, దణ్నం పెట్టేస్తాం కదా. నిజంగా ఈ శ్లోకం వినాయకునిదేనా?‘శుక్ల+అంబర+ధరమ్’ అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. వినాయకుడెప్పుడూ ఎర్రని వస్త్రాలే కడతాడు. మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటోంది? ‘విష్ణుమ్’ అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. దీన్నిబట్టే తెలుస్తోంది కదా! ఈ శ్లోకం విష్ణువుకి సంబంధించినదే అని! మరి వినాయకుని దగ్గరెందుకు చదవడం? ‘శశి వర్ణమ్’ అనేది శ్లోకంలోని మూడో పదం. శశి అంటే చంద్రుడు కాబట్టి ‘శశి వర్ణమ్’ అంటే చంద్రునితో సమానమైన శరీరచ్ఛాయతో ఉంటాడనేది అర్థం మరి. వినాయకుడు చంద్రునిలా తెల్లగా ఉండడు. ఆయన కు-జుడు (పృథివికి సంబంధించినవాడు) కాబట్టి, ఎరుపు రంగులో ఉంటాడు. ఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదాని, పోనీ విష్ణువుకి సంబంధించినదా! అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే? శుక్ల+అంబర+ధరమ్ - తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా! (పీతాంబరః) మరి ఇదేమిటి? శశి వర్ణమ్ - తెల్లని శరీరచ్ఛాయ ఆయనకెక్కడిది? నీలమేఘశ్యాముడు కదా! ఇలా ఉండటమేమిటి? ఇలా ఆలోచన పరంపర సాగిపోతోంది. మరి ఎలా సందేహ నివృత్తి? శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని. (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం) ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు. ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం. ఇంతకీ ఈ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం! శశి వర్ణమ్ - శశి అంటే చంద్రుడనేది నిజమే కానీ, ఆ అర్థమెలా వచ్చింది? శశ (కుందేలు) వర్ణం (లక్షణం) ఆయనకి ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది ఏ లక్షణంట? నేలమీద ఓ క్షణం - గాలిలో (ఆకాశంలో) ఓ క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవనూ నడవదు. పూర్తిగా ఎగరనూ ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. ఆ లక్షణమే కదా చంద్రునిది! ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య. ఓసారి ఎదుగుతూ పోవడం, మరోసారి తరుగుతూ రావడం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో, వినాయకుడిలో ఎవరో చూద్దాం. చతుః+భుజమ్ - చతుర్భుజమ్ - విష్ణువుకి నాలుగు చేతులు ఉండే మాట నిజమే. వినాయకుణ్ని కూడా అలా చూస్తాం కానీ, వినాయకునికి రెండు చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడూ లేదు - ఉండదు. ఇక ప్రసన్న వదనమ్ - చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండచ్చుగా. అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖమైతే గమనించగలం. మరి అదే గజ ముఖం నుండి ఎలా తెలుసుకోగలం! ఓ ఆవు నవ్వుతోందనీ, ఓ లేడి వెక్కిరిస్తోందనీ అర్థం చేసుకో వీలౌతుందా? కాబట్టి ఈ విశేషణం కూడా విష్ణువుకి సంబంధించినదే అనిపిస్తుంది. సర్వ విఘ్న ఉపశాంతయే - ఈ విఘ్నాలు తొలగించడం అనే మాటకొచ్చేసరికి, ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకగా ఉన్న ఈ శ్లోకం ఇద్దరిదీనా మరి? ఔను. ఈ శ్లోకం ఇద్దరిదీను. రహస్యమేమంటే శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ (సర్వాధారః కాలః - కాలః కలయతా మహమ్) వినాయకుడని పిలిపించుకుంటాడు. అంతే! ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుద్ధ పక్ష కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుద్ధ + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు ఆయన. లక్ష్మీ గణపతి శ్రీహరీ వినాయకుడూ ఒకే రూపమే కాబట్టి ఉద్యోగ బాధ్యతలని బట్టి పేరు మాత్రమే భేదం కాబట్టి, గణపతికి ఎడమ తొడమీద లక్ష్మీదేవి కనిపిస్తుంది, లక్ష్మీ గణపతి రూపంలో. స్త్రీ ఎప్పుడూ తన పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోవాలి. సంతానం మాత్రం కుడి తొడమీద కూర్చోవాలి! అందుకే అక్షరాభ్యాసాది సర్వ శుభకార్యాల్లోనూ కుడి తొడమీదే కూచోబెట్టుకుని, చేయవలసిన ప్రక్రియని ముగించాక, గురువుగారికి అందించి వారితో అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు శిశువుకి. ప్రయాగలో త్రివేణీ సంగమ స్థలంలో వేణీదానం (స్త్రీల శిరోజాల చివరి భాగాన్ని తుంచడం) చేసే సందర్భంలో స్త్రీని పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోబెడతారు. ఇదంతా ఆ లక్ష్మీగణపతి విగ్రహం మనకి నేర్పిన సంప్రదాయమే. వి-ఘ్నం ‘వి - విశేషంగా ప్రారంభించబడిన పని, ఘ్న - మరింక ఏ తీరుగాను కూడ బాగుచేయ వీల్లేని రీతిలో ధ్వంసం కావడ’మని విఘ్నమనే పదానికర్థం. తిరిగి ప్రారంభించగల విధానమున్న పద్ధతిలో కలిగేది తాత్కాలిక విఘ్నం. దీనివల్ల కొంత మనో వైకల్యమున్నా పెద్ద ఇబ్బంది లేదు. అదే శాశ్వత విఘ్నమైతే చెప్పేదేముంది? పాల సముద్రాన్ని చిలికే వేళ మందరమనే పర్వతం సముద్రంలోకి దిగబడి, బురదలో కూరుకుపోవడం తాత్కాలిక విఘ్నం. దాన్నుండి ఉద్ధరించి విఘ్న నివారణాన్ని చేసింది (కూర్మావతారాన్నెత్తి) శ్రీహరే కదా! ఇక విశ్వామిత్రుడు త్రిశంకుడనే పేరున్న రాజుని బొందితో స్వర్గానికి పంపించదలచి చేయవలసిన ప్రయత్నాలన్నింటినీ చేసి, స్వర్గ మర్త్య మధ్యభాగంలో విడిచి వేయడమనేది శాశ్వత విఘ్నానికి కలిగిన ఫలితం. విఘ్నమనేది ఏ ఆహారాన్ని తినడం వల్లనో, ఏ ప్రదేశానికి వెళ్లడం వల్లనో వచ్చేది కాదు. కాలం గడుస్తూ ఉండగా కాలవశంగా వచ్చేది మాత్రమే. అందుకే శ్రీహరి తనని గురించి తాను భగవద్గీతలో - కాలః కలయతా మహమ్ - లెక్కింపబడే వాటిలో కాలాన్ని నేను (కాలో స్మి) అని స్పష్టంగా చెప్పుకున్నాడు. ఇక వినాయకుడూ శ్రీహరీ ఒక్క రూపమే అయిన కారణంగానే వినాయకుడు కొన్ని ప్రదేశాల్లో ఊర్ధ్వ పుండ్రధారిగా కనిపిస్తాడు. విష్వక్సేనుడు ఈయనే. ఈయన పరివారమంతా కూడా ఈ రూపంతోనే ఉంటారంటుంది శ్రీ విష్ణు సహస్రనామం. శ్రీహరి రక్షణ బాధ్యతని చేపట్టే దైవం కాబట్టే, ఆయన కాలస్వరూపాధి దేవతా రూపంగా - అంటే - వినాయకునిగా మారి మమ్మల్ని రక్షిస్తూ ఉండవలసిందని ప్రార్థిస్తూ పెట్టే విగ్రహమే మనకి వీధి శూల ఉన్న ఇళ్ల ముందు కనిపిస్తుంది. ‘ఓ కాలస్వరూప వినాయకుడా! శ్రీహరి రూపమా! కాల గతిలో రావలసిన విఘ్నాలు రాకుండా నీవున్న ఇంటిలోని జనుల్ని రక్షిస్తూ ఉండవలసిం’దని ప్రార్థించడం దీని భావం. అయితే వట్టిగా ఆ విగ్రహాన్ని వీధిశూల ఉన్న ఇంటికి పెట్టేయడం కాకుండా, ఆ విగ్రహానికి శక్తి వచ్చేందుకై రోజూ అష్టోత్తర నామార్చననైనా చేయించాల్సిందే తప్ప లేని పక్షంలో అక్కడ వినాయక విగ్రహం పెట్టినా మరో బొమ్మని పెట్టినా ప్రయోజనం ఒకటే. కాల స్వరూపం గజం. అంటే ఏనుగుది ఎలా మందబుద్ధి విధానమో, అలాంటిదే కాలానిది కూడ. అలా కానినాడు మనం జీవితంలో పొందిన దుఃఖాలని, అవమానాలని, కష్టాలని ఏనాడూ మరిచిపోలేం. కాలంలో ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నట్లు, కాలస్వరూపమైన వినాయకుని తొండం కుడిగా ఎడమవైపుగా విగ్రహాల్లో రెండు తీరులుగాను ఉంటుంది. పంచాయతనం ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు అనే ఈ ఐదుగురినీ నాలుగు దిక్కులా నలుగురినీ ఉంచి, మధ్యలో ఎవరిని ప్రధాన దైవంగా భావించాలనుకుంటున్నామో అలా ఆరాధించడం పంచ+ఆయతన విధానం (ఐదుగురికి స్థానాన్ని ఏర్పాటుచేసి, ఐదుగురూ ఒకచోట ఉండగా అందరినీ పూజించే తీరు) అన్నారు పెద్దలు. ప్రసిద్ధ అన్నవర క్షేత్రానికెళ్తే ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో అంబిక, ఈశాన్యంలో మహేశ్వరుడు, ఈ అందరికీ మధ్యలో విష్ణువు. ఆ స్తంభం పైభాగంలో పై అంతస్థు మీద శ్రీ వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఇటు శంకరుడు అటు అమ్మవారు ఉండగా దర్శనమిస్తారు. అక్కడ అన్నిటి మధ్యా విష్ణువున్న కారణంగా అది విష్ణు పంచాయతనమన్నమాట. ఈ పంచాయతన విధానాన్ని నేర్పింది మనకి శ్రీహరే. అందుకే భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో మహేశ్వరుణ్ని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండవలసిందని కాలచక్రంలో ఓ స్థిర నిర్ణయాన్ని చేసేశాడు. ఆ కారణంగా వినాయక చవితి పేరిట ఈ ఒక్కరోజునే గణపతి పూజని చేసేసుకుని ముగించుకోవడం కాకుండా, ఈ కాల పంచాయతనంలో మరో నలుగురు దైవాలు క్రమంగా నెలకొక్కరు రాబోతున్నారని గ్రహించి, వారిని కూడా ఆరాధించడాన్ని చేస్తే, అక్కడికి పంచాయతన పూజ ముగిసినట్లన్నమాట! ఆ కారణంగా ఈ చేయబోయే పంచాయతన పూజకి ఏ విఘ్నమూ కలగకుండా చేయవలసిందంటూను, బుద్ధికి అధిష్ఠాత వినాయకుడే కాబట్టే ఏ విఘ్నమూ లేకున్నా కూడా పూజచేసే బుద్ధిని ప్రసాదించవలసిందిగాను ప్రార్థిద్దాం! గం గణపతియే నమః! - డా॥మైలవరపు శ్రీనివాసరావు -
గణేశ్ మహరాజ్‌కీ జై..!
రాంగోపాలపేట్: వీరాంజనేయులు అపార్ట్మెంట్లో పప్పుధాన్యాలతో ఏకదంతుడు, కుమ్మర్‌వాడీలో...అలియాబాద్‌లో తామర పువ్వులో కొలువుదీరిన బొజ్జ వినాయకుడు. రజిత కవచాలంకరణలో శ్రీ విజయగణపతికొండాపూర్ చౌరస్తాలో శివుని స్వరూపంలో... చందానగర్: లక్ష్మీ, సరస్వతిల మధ్య గజేంద్రుడుజూబ్లీహిల్స్: గణేశుడి వద్ద విభిన్న వేషధారణలతో చిన్నారులుమురళీ కృష్ణుడిగా... జగద్గిరి గుట్ట: గజాననుడిపై కొలువుదీరిన బొజ్జగణపతిమూసాపేట: రాముడి అవతారంలో, వనస్థలిపురం: దూదితో... కొత్తపేట న్యూ మారుతీనగర్‌లో... ఎల్బీనగర్ సెల్ఫ్ ఫైనాన్స్కాలనీలో... సచివాలయనగర్లోని గోవర్ధన గిరిధారిగా... గుడిమల్కాపూర్ శివబాగ్లో కేథరీనాథ్ ఆకారంలో గణపయ్య మందిరం సికింద్రాబాద్: గణపతి ఆలయంలో మంచు గణపయ్య ఖైరతాబాద్: మహాగణపతి వద్ద విదేశీయులు -
ఖైరతాబాద్ వినాయకుడు