
వనజాక్షిపై దాడి జరిగినప్పుడే చర్యలుంటే..
గతంలో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకొని ఉంటే.. ఏర్పేడు ఘటన జరిగేది కాదని నారాయణ అన్నారు.
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుక మాఫియా అవతారమెత్తారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గతంలో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకొని ఉంటే.. ఏర్పేడు ఘటన జరిగేది కాదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతల ధనదాహమే ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైందని నారాయణ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీపై హత్యానేరం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.