
సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు.
సాక్షి, విజయవాడ: సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు. మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్‌కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్‌కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.
ఇదీ చదవండి: అవే బ్రాండ్లు... అవే రేట్లు