బాధితురాలికి ఆర్థిక సాయం అందిస్తున్న బియ్యపు పవిత్రారెడ్డి
సాక్షి, చిత్తూరు (రేణిగుంట) : నివర్ తుపాన్ సమయంలో రాళ్లకాలువ వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి కుమ్మరిపల్లె దళితవాడకు చేరుకుని బాధిత కుటుంబానికి నగదు అందజేసి వారిని ఓదార్చారు. అలాగే ప్రభుత్వం తరపున మరో రూ.5లక్షల పరిహారాన్ని మృతుడి భార్య నాగభూషణకు అందించారు.
ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మృతుడి పిల్లలు ధీరజ్, హమీష్‌లను తామే చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగభూషణకు ఫించను మంజూరు పత్రం అందించారు. గ్రామ వలంటీర్ ఉద్యోగాన్ని సైతం ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం అదే వాగులో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వెంకటేష్, లోకేష్‌లను కూడా పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, జువ్వల దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, మునిరెడ్డి, శేషారెడ్డి, బాబ్జీ, హరి పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..)
Comments
Please login to add a commentAdd a comment