మేము పారిపోవడం లేదు: వెంకయ్య | we are not far away: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

మేము పారిపోవడం లేదు: వెంకయ్య

Published Fri, Jul 29 2016 4:55 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

మేము పారిపోవడం లేదు: వెంకయ్య - Sakshi

మేము పారిపోవడం లేదు: వెంకయ్య

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు చేయాల్సిదంతా చేశామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్టు తాము పారిపోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలిసి రావాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారో, లేదో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతకుముందు డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ తప్ప అన్ని పార్టీలు పోరాడుతున్నాయని సీపీఐ సీనియర్ నేత డి. రాజా విమర్శించారు. ప్రధాని ఇచ్చిన హామీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటోందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement