24 ఏళ్ల తరువాత రాజ్యసభకు దేవెగౌడ | HD Deve Gowda Takes Oath As Rajya Sabha Member after 24 years | Sakshi
Sakshi News home page

24 ఏళ్ల తరువాత రాజ్యసభకు దేవెగౌడ

Published Mon, Sep 21 2020 6:52 AM | Last Updated on Mon, Sep 21 2020 6:52 AM

HD Deve Gowda Takes Oath As Rajya Sabha Member after 24 years - Sakshi

సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ (87) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో కన్నడభాషలో ప్రమాణం చేశారు. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆయన రాజ్యసభలో అడుగుపెట్టడం విశేషం. గతంలో 1996 జూన్‌ నుంచి 1997 ఏప్రిల్‌ వరకు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగానే ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. కరోనా లాక్‌డౌన్‌ ఉండడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement