భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్‌ అసహనం | Jaya Bachchan Objects At Being Addressed As Jaya Amitabh Bachchan In Rajya Sabha | Sakshi
Sakshi News home page

భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్‌ అసహనం

Published Tue, Jul 30 2024 11:07 AM | Last Updated on Tue, Jul 30 2024 11:26 AM

Jaya Bachchan Objects At Being Addressed As Jaya Amitabh Bachchan In Rajya Sabha

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్‌ నటీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్తతో పేరుతో కాకుండా జయా బచ్చన్‌ అని పిలిస్తే చాలని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌తో అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎస్పీ రాజ్యసభ సభ్యురాలైన ఆమెను మాట్లాడావల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘శ్రీమతి జయా అమితాబ్‌ బచ్చన్‌ జీ, ప్లీజ్‌’ అని కోరుతారు. 

అయితే స్పీకర్‌ పూర్తి పేరుతో పిలవడంపై జయా బచ్చన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్‌ అని పిలిస్తే చాలని ఆమె స్పీకర్‌కు బదులు ఇచ్చారు. అయితే దీనిపై డిప్యూటీ  స్పీకర్‌ స్పందిస్తూ..  మీపేరు పార్లమెంట్‌ రికార్డుల్లో అధికారికంగా  జయా అమితాబ్‌ బచ్చన్‌ అని ఉందని తెలిపారు. పార్లమెంట్‌ రికార్డుల్లో ఎలా రాసిఉందో.. అలాగే తాను పిలిచినట్లు డిప్యూటీ స్పీకర్‌ అన్నారు. అయినప్పటికీ జయా బచ్చన్‌ అభ్యంతం తెలిపారు. ‘‘ఇది చాలా కొత్తగా ఉంది.  మహిళలను వారి భర్తలపేరుతో గుర్తించటం.  భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంతం ఉనికి,  సాధించిన విజయాలు ఉండవా?’’ అని ఆమె అన్నారు.

అనంతరం ఆమె ఢిల్లీలో  సివిల్స్‌ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి  వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై  మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో రాజకీయలను తీసుకురాము’ అని జయా బచ్చన్‌ అన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement