రాజ్యసభలో అమితాబ్‌ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్‌ | Jagdeep Dhankar burst out laugh at Jaya Bachchan's Amitabh mention | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో అమితాబ్‌ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్‌

Published Sat, Aug 3 2024 8:52 AM | Last Updated on Sat, Aug 3 2024 9:17 AM

Jagdeep Dhankar burst out laugh at Jaya Bachchan's Amitabh mention

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్‌ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్‌ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. 

అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌.. ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.  తనను ‘‘జయా బచ్చన్‌ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్‌ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్‌ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్‌ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్‌ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్‌ ధన్‌ఖడ్‌ పగలబడి నవ్వారు. అనంతరం  ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్‌ సమయంలో లంచ్‌ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడం​తో సభలో నవ్వులు విరిశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement