రాజ్యసభలో దొరికిన డబ్బులు ఎవరివి? | I Carry One Rs 500 Notes, abhishek Singhvi Reaction On Money | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో దొరికిన డబ్బులు ఎవరివి?

Published Fri, Dec 6 2024 3:04 PM | Last Updated on Fri, Dec 6 2024 4:59 PM

I Carry One Rs 500 Notes, abhishek Singhvi Reaction On Money

ఢిల్లీ : రాజ్యసభలో సెక్యూరిటీ అధికారులకు రూ.50వేల నగదు లభ్యమవ్వడంపై దుమారం చెలరేగింది.  సభలో కాంగ్రెస్‌ ఎంపీ  అభిషేక్‌ మను సంఘ్వీకి కేటాయించిన స్థానంలో ఆ నగదు లభ్యమైందని  భారత ఉపరాష్ట్రపతి, రాజ్య‌స‌భ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వెల్లడించారు. వెంటనే ఆ నగదుపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే జగదీప్‌ ధనకర్‌ ఆదేశాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టకుండానే నగదు ఎక్కడ దొరికిందో చెప్పడం సరైంది కాదన్నారు. విచారణ పూర్తయిన తర్వాత సభలోని సభ్యుల పేర్లను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, తన స్థానంలో రూ.50వేల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ఖండించారు. రూ.50వేల నగదు గురించి నాకు తెలియదు. భారీ మొత్తంలో రాజ్యసభలో నగదు లభ్యమైందని తొలిసారి వింటున్నా. గురువారం  రాజ్యసభకు వెళ్లేటప్పుడు జేబులో రూ. 500 నోటు మాత్రమే ఉంది. మధ్యాహ్నం 12.57 గంటలకు రాజ్యసభకు చేరుకున్నాను.. మధ్యాహ్నం 1.00 గంటకు సభ వాయిదా పడింది. అనంతరం 1.30 గంటల వరకు క్యాంటీన్‌లో కూర్చున్నాను.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాను.’ అని సింఘ్వీ తెలిపారు.

కొన్నినిమిషాల పాటు సభలో కూర్చున్నానని, రూ.50వేల నగదు తన సీటు వద్ద ఎలా దొరికాయో తనకు తెలియదని అన్నారు. విచారణ చేపడితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఎక్స్‌ వేదికగా స్పందించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement