న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి.. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాజ్యసభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నాయి. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై తగిన చర్చకు అనుమతించడం లేదని, వివాదాస్పద చర్చల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే రాజ్యంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం జగ్‌దీప్‌ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఇతర భారత బ్లాక్ పార్టీల సభ్యులు ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీర్మానంపై ఇప్పటికే ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
కాగా బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్‌తో కాంగ్రెస్ నేతలు లింకు పెట్టుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభాపక్ష నేత, ప్రతిపక్ష నేతలతో ధన్‌కడ్ సమావేశం నిర్వహించి సభను సజావుగా సాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఐక్యత, సార్వభౌమత్వం.. దేశానికి పవిత్రమైనవని, ఆ ఐకమత్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడాన్ని సహించబోమని ధన్‌కడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment