ఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయబచ్చన్ రాజ్యసభలో శుక్రవారం వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పారు. అమె ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఒక సందర్భంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయితే ఆ విషయాన్ని జయా బచ్చన్ రాజ్యసభ వీడ్కోలు సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ రోజు తాను ప్రవర్తించిన తీరుకు రాజ్య సభ చైర్మన్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాని తెలిపారు.
‘మీరు ఎందుకు ఆవేశపడతారని నన్ను చాలా మంది అడుగుతారు. అది నా తత్వం. నేను సహజమైన ప్రవర్తనను మార్చుకోను. నాకు కొన్ని విషయాలు నచ్చకపోతే లేదా అంగీకరించలేకపోతే వెంటనే కొంత శాంతాన్ని కోల్పోతాను. నా ప్రవర్తన, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నా మాటలను వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారికి నా క్షమాపణలు. నాది క్షణికమైన ఆవేశం తప్పితే.. నాకు ఎవరిని నొప్పించాలని ఉండదు’ అని అన్నారామె.
Samajwadi Party MP Jaya Bachchan apologised to the fellow members of the Rajya Sabha during her farewell speech.
— Moneycontrol (@moneycontrolcom) February 9, 2024
Watch for more🎥#JayaBachchan #SamajwadiParty #RajyaSabha pic.twitter.com/7AeNPQjDwg
వీడియో క్రెడిట్స్: moneycontrol
ఇక.. పెద్దల సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల సహకారం, ప్రేమను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేసుకున్నారు. పెద్దల సభలో సదరు సభ్యుల ద్వారా పంచుకున్న జ్ఞానాన్ని తాను ఇక నుంచి మిస్ అవుతానని అన్నారు. రిటైర్ అవుతున్న సభ్యుల వల్ల సభలో కొంత శూన్యత కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు.
మంగళవారంనాడు సభలో కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నను దాటేవేసే క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్.. జయా బచ్చన్ నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. దీంతో ధన్‌ఖడ్.. సభ్యులకు సమస్యను చెబితే వారు అర్థం చేసుకోగలరని వారేం చిన్న పిల్లలు కాదని అన్నారు. దీంతో జయా.. ఎంపీలను సభలో గౌరవంగా చూడాలని అన్నారు. సభలోని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడాని దాటివేసిన ప్రశ్నను మళ్లీ అడగాలని ధన్‌ఖడ్ అనుమతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment