‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’ | Himanta Sarma vs Congress MP Turns Persona | Sakshi
Sakshi News home page

‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’

Published Sun, Apr 27 2025 7:23 PM | Last Updated on Sun, Apr 27 2025 9:08 PM

Himanta Sarma vs Congress MP Turns Persona

దిస్‌పూర్‌: అస్సాం రాష్ట్రంలో అక్రమ బొగ్గు మైనింగ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేల్(ఈడీ) దాడులు చేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది రాష్ట్ర అంశాలను వదిలి వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది.

అక్రమ బొగ్గు మైనింగ్ మీ కనుసన్నల్లోనే..
‘అస్సాం బొగ్గు మైనింగ్ లో ఈడీ రూ. 1.58 కోట్లు సీజ్ చేసింది. తప్పుడు పత్రాలతో 1200 టన్నుల అక్రమ బొగ్గు మైనింగ్ ప్రతీరోజూ జరుగుతుంది. ఇదంతా సీఎం హిమాంత బిశ్వా కనుసన్నల్లోనే జరుగుతుంది’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ.

మీ పిల్లలకు భారత పౌరసత్వం లేదు.. ఎందుకు?
‘ ఏం మాట్లాడుతున్నావ్ గొగోయ్. మీ భార్య ఎలిజిబెత్ కోల్ బర్న్ గొగోయ్ పాకిస్తాన్ ఎన్జీవో సంస్థ నుంచి శాలరీ తీసుకోవడం నిజం కాదా.. మీ పిల్లలకు భారత పౌరసత్వం కూడా లేదు’ అంటూ మండిపడ్డారు సీఎం హిమాంత బిశ్వా శర్మ.

దేనికైనా రెడీ
దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ తన భార్య పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటుందని, పిల్లలకు భారత పౌరసత్వం లేదనే వ్యాఖ్యలపై తాను బహిరంగ  చర్చకు సిద్ధమన్నారు. ఇలా ఇరువురి నేతల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement