
- ఏఐఎన్ పిఎస్ఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్
పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని.. ఆలిండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఏఐఎన్ పిఎస్ఎఫ్)జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఏఐఎన్ పిఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా "మాచన" ను నియమించినట్టు..జాతీయ అధ్యక్షులు మంజీత్ సింగ్ పటేల్ ఫోన్ ద్వారా తెలియపరిచారని రఘునందన్ చెప్పారు.
ఈ సందర్భంగా.. ఆదివారం హైదరాబాద్ లో రఘునందన్ మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకం లో ఉన్నారని రఘునందన్ చెప్పారు.2004 సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ లో భాగస్వామ్య పింఛను పథకం అమలు ప్రారంభం అయ్యిందని,ఉద్యోగం అంటేనే ఒక సామాజిక భద్రత కాగా.. సి పి ఎస్ లో ఉన్న ఉద్యోగి కి అర్ధిక భద్రత తో పాటు సామాజిక భద్రత కూడా ఉండదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.
ప్రమాద వశాత్తు ఎవరైనా సిపిఎస్ ఉద్యోగికి అవాంఛనీయ సంఘటనకు గురైతే కనీసం లక్ష రూపాయలు కూడా వారి ఖాతా లో ఉండవని, అటువంటపుడు పెన్షన్ రాని ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేటు ఉద్యోగమే మిన్న అన్న భావన ను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారని రఘునందన్ అభిప్రాయపడ్డారు. వచ్చే నెల ఉత్తర ప్రదేశ్ లో జరిగే జోనల్ సమావేశానికి తనను ఆహ్వానించారని "మాచన" తెలిపారు.