
కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలి
రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గెలుపు ఎన్డీఏ కోసం కాదని... భారత్ కోసమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి పొందాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో పొత్తుల వల్ల బీజేపీ,టీడీపీలు ఒకదానికొకటి సహకరించుకుంటాయని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. 10 ఏళ్ల యూపీఏ పాలన 8 అంశాలలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీపై వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు.