
అభివృద్ధికి ఆత్మబంధువు మోడీ: వెంకయ్య
హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ శకం ముగిసి, బీజేపీ శకం ప్రారంభమైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు. మోడీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్ బెంబేలేత్తుతోందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధికి ఆత్మబంధువు మోడీయేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. మోడీ హవాను ఆపే శక్తి ఎవరికీ లేదని దీమా వ్యక్తం చేశారు. దేశాన్ని అన్ని రకాలు దోచుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ హుందాగా తప్పుకుని, గౌరవప్రదంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని వెంకయ్య నాయుడు సూచించారు.