ఇళ్ల నిర్మాణ నైపుణ్యంలో సాయం చేయండి | PM Narendra Modi seeks Singapore's help in housing sector | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణ నైపుణ్యంలో సాయం చేయండి

Published Thu, Jul 3 2014 3:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

PM Narendra Modi seeks Singapore's help in housing sector

సింగపూర్‌ను కోరిన ప్రధాని మోడీ
 న్యూఢిల్లీ: దేశంలో 2022లోగా అందరికీ తక్కువ ఖర్చులో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ఎజెండా అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇళ్ల నిర్మాణంలో నైపుణ్యాన్ని పంచుకోవడంలో తమకు సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం స్వయంగా సింగపూర్‌ను కోరగా మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గృహనిర్మాణ మంత్రులతో రెండు రోజుల సమావేశాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలో ప్రారంభించారు. భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ విదేశాంగ మంత్రి కె. షణ్ముగంతో భేటీ సందర్భంగా మోడీ ఈ సూచన చేసినట్లు ప్రధాని కార్యాలయం  ఓ ప్రకటనలో తెలిపింది. 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని మోడీ భావిస్తున్నట్లు పేర్కొంది.
 
 ప్రజాకర్షక సబ్సిడీలొద్దు: వెంకయ్య

 2022లోగా అందరికీ ఇళ్లు కట్టించాలన్న లక్ష్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్రాల గృహనిర్మాణ మంత్రుల సమావేశంలో వెంకయ్య నాయుడు తెలిపారు. భారీ స్థాయిలో ఆర్థిక వనరులు అవసరమైన ఈ బృహత్తర పథకం కోసం అన్ని రకాల ఆర్థిక మోడళ్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన సేవల కోసం అయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని...అందువల్ల పట్టణ ప్రణాళికల్లో ప్రజాకర్షక సబ్సిడీ వైఖరి స్థానంలో ఈ విధానానికి చోటు కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement