పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు.. | Venkaiah Naidu Meets Montek Singh Ahluwalia | Sakshi
Sakshi News home page

పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు..

Published Thu, Feb 27 2014 5:15 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు..

పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు..

న్యూఢిల్లీ: ప్రజలు విభజన గురించి మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం విలీనం గురించి మాట్లాడుతోందని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. విభజన నుంచి ప్రజలు తేరుకోకముందే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్కొ రాజధాని పేరు చెబుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ విభజన చేపట్టిందన్నారు. కేంద్రం విభజన చేసిన తీరును చూస్తే పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు ఉందని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాను వెంకయ్య కలిశారు. సీమాంధ్రకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆహ్లువాలియాతో చర్చించినట్టు ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న వాటిని పరిశీలించడానికి కమిటీ వేస్తామని ఆహ్లువాలియా చెప్పారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement