రేపు కమలనాథన్ కమిటీ తొలి భేటీ | Kamalanathan Committee First Meeting Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు కమలనాథన్ కమిటీ తొలి భేటీ

Published Wed, Mar 5 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

Kamalanathan Committee First Meeting Tomorrow

సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ గురువారం తొలిసారిగా భేటీ కానుంది. కమలనాథన్‌తో పాటు ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉన్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలకు ఈ భేటీలో రూపకల్పన చేయనున్నారు.

మరోవైపు అన్ని శాఖల్లో విభజన పని పురోగతిపై సమీక్షించేందుకు రాష్ట్ర సీఎస్ బుధవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెలాఖరుకల్లా ఫైళ్లు, ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనను ఒక కొలిక్కి తీసుకురావాలని సీఎస్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎస్ మంగళవారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారులతో సమావేశమై సమీక్షించారు.

ఇరు రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పరిపాలనా సంస్కరణలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలలు, ఆస్పత్ల్రు ఉన్నాయి, వాటికి అదనంగా ఏ రాష్ట్రంలోనైనా ఏర్పాటు చేయాల్సిన అవసరముందా? అనే అంశాలను పరిశీలించనున్నారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని.. దానికి అవసరమైన మౌలిక వసతులు ఎలా ఉన్నాయో కూడా సీఎస్ సమీక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement