తెలుగు, కన్నడ రాష్ట్రాలకు నిధులివ్వండి
* కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరిన కేంద్ర మంత్రి వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను సమయానుసారంగా విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి వెంకయ్య సోమవారం బీరేంద్ర సింగ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సకాలంలో నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను, 13వ ఆర్థిక మండలి నిధులను వారంలోపే విడుదల చేయడానికి గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ హామీ ఇచ్చారు.