
9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు?
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ సమస్యను నాన్చిన కాంగ్రెస్కు ఎన్నికలకు ముందు ఈ విషయం గుర్తొచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. 9 ఏళ్ల 9 నెలల పాటు తెలంగాణ బిల్లును కాంగ్రెస్ ఎందుకు మర్చిపోయిందని ఆయన ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారని గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని కమల్నాథ్ చెప్పడం విచారకరమన్నారు.
బీజేపీ వల్లే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీకి ఒప్పించామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరిస్తే ఆ ఘనత సోనియాదని ప్రచారం చేసుకుంటున్నారని వెంకయ్య నాయుడు వాపోయారు.