సీమాంధ్రకు పన్ను మినహాయింపు!
న్యూఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి జరుగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష బీజేపీ ప్రతిపాదించిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సవరణ ప్రతిపాదనలపై కాంగ్రెస్, బీజేపీ ఈ మేరకు అవగాహనకు వచ్చాయి. సీమాంధ్రకు ప్రత్యే ప్రతిపత్తి, ప్యాకేజీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. హిమచల్‌ప్రదేశ్ తరహాలో సీమాంధ్రకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
బుందేల్‌ఖండ్ తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఒప్పుకుంది. రెండు రాష్ట్రాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించాలన్న బీజేపీ సూచనకు సముఖత వ్యక్తం చేసింది. భద్రాచలం మినహా మిగతా రెవెన్యూ డివిజన్ సీమాంధ్రకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. సభాముఖంగా ప్రధాని ప్రకటన చేస్తారని కేంద్రం హామీయివ్వడంతో బిల్లు ఆమోదానికి బీజేపీ అంగీకరించింది.