తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీతో తాము పొత్తు పెట్టుకోబోమని, ఆ ప్రతిపాదన కూడా లేదని అన్నారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నేతలు జీ కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్‌లతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణను వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిన సీబీఐ, ఎప్పుడేం చోస్తోందో అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు. రెడ్‌కార్నర్ నోటీసు సాకుతో బాబా రాందేవ్‌ను లండన్ విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీ పాదాభివందనాన్ని అద్వానీ పట్టించుకోలేదనే వార్తలను నాయుడు తోసిపుచ్చారు. ‘ఆధార్’పై సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఇదిలావుంటే, బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు అక్టోబర్ 2న ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర నాయకుల్ని కలవనున్నారు.
టీడీపీతో పొత్తుండదు : వెంకయ్యనాయుడు
Published Fri, Sep 27 2013 3:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement