28న 'జన-ధనయోజన' ప్రారంభం | pradhanmantri jan-dhan yojana to lauch on august 28 | Sakshi
Sakshi News home page

28న 'జన-ధనయోజన' ప్రారంభం

Published Mon, Aug 25 2014 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

28న 'జన-ధనయోజన' ప్రారంభం

28న 'జన-ధనయోజన' ప్రారంభం

హైదరాబాద్: శాస్త్రవేత్తల పరిశోధనలు కేవలం రక్షణ రంగానికే కాకుండా రైతులు, సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉండాలని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నెల 28న ఢిల్లీలో ప్రధానమంత్రి జన-ధనయోజన పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని చెప్పారు.

దీని ద్వారా ఖాతాదారుడికి డబ్బుకు భద్రతతో పాటు వడ్డీ లభిస్తుంది. ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి జన-ధనయోజన పథకాన్ని నరేంద్ర మోడీ ఆగస్టు 15న ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement