pradhanmantri jan-dhan yojana
-
ఖాతాదారులకు రూ. 164 కోట్లు బాకీ పడ్డ ఎస్బీఐ...!
SBI Yet To Refund Rs 164 Cr Undue Fee Charged From Jan Dhan Holders: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారులకు భారీ మొత్తంలో బాకీ పడినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ. 164 కోట్లను ఎస్బీఐ ఇంకా రిఫండ్ చేయలేదు. ఏప్రిల్ 2017 నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో జన్‌ధన్ ఖాతాల డిజిటల్ చెల్లింపుల కోసం ఛార్జీలను ఎస్బీఐ వసూలు చేసింది. ఈ విషయంపై ఐఐటీ ముంబై సమగ్ర నివేదికను రూపొందించింది. చదవండి: ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..! ఈ నివేదిక ప్రకారం... సదరు అమౌంట్‌ను తిరిగి ఆయా ఖాతాదారులకు చెల్లించాలని ప్రభుత్వం ఎస్బీఐకు సూచనలు చేసింది. దీంతో జన్‌ధన్ ఖాతాదారులకు సుమారు రూ. 90 కోట్లను మాత్రమే తిరిగి ఇవ్వగా...ఇంకా రూ.164 కోట్లను ఎస్బీఐ చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 2017 నుంచి సెప్టెంబర్ 2020 జన్ ధన్ పథకం కింద తెరిచిన ఖాతాలనుంచి ఒక్కో లావాదేవీకి రూ.17.70 చొప్పున బ్యాంకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎస్బీఐను వివరణ కోరగా...ఇంకా స్పందించకపోవడం గమనర్హం. సదరు అమౌంట్ వెంటనే రీఫండ్‌చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ ఉత్తర్వులను జారీ చేసింది. చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడుల వర్షం! -
28న 'జన-ధనయోజన' ప్రారంభం
హైదరాబాద్: శాస్త్రవేత్తల పరిశోధనలు కేవలం రక్షణ రంగానికే కాకుండా రైతులు, సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉండాలని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నెల 28న ఢిల్లీలో ప్రధానమంత్రి జన-ధనయోజన పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని చెప్పారు. దీని ద్వారా ఖాతాదారుడికి డబ్బుకు భద్రతతో పాటు వడ్డీ లభిస్తుంది. ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి జన-ధనయోజన పథకాన్ని నరేంద్ర మోడీ ఆగస్టు 15న ప్రకటించిన సంగతి తెలిసిందే.