
SBI Yet To Refund Rs 164 Cr Undue Fee Charged From Jan Dhan Holders: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ మొత్తంలో బాకీ పడినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ. 164 కోట్లను ఎస్‌బీఐ ఇంకా రిఫండ్ చేయలేదు. ఏప్రిల్ 2017 నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో జన్‌ధన్ ఖాతాల డిజిటల్ చెల్లింపుల కోసం ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేసింది. ఈ విషయంపై ఐఐటీ ముంబై సమగ్ర నివేదికను రూపొందించింది.
చదవండి: ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!
ఈ నివేదిక ప్రకారం... సదరు అమౌంట్‌ను తిరిగి ఆయా ఖాతాదారులకు చెల్లించాలని ప్రభుత్వం ఎస్‌బీఐకు సూచనలు చేసింది. దీంతో జన్‌ధన్ ఖాతాదారులకు సుమారు రూ. 90 కోట్లను మాత్రమే తిరిగి ఇవ్వగా...ఇంకా రూ.164 కోట్లను ఎస్‌బీఐ చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 2017 నుంచి సెప్టెంబర్ 2020 జన్ ధన్ పథకం కింద తెరిచిన ఖాతాలనుంచి ఒక్కో లావాదేవీకి రూ.17.70 చొప్పున బ్యాంకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎస్‌బీఐను వివరణ కోరగా...ఇంకా స్పందించకపోవడం గమనర్హం. సదరు అమౌంట్ వెంటనే రీఫండ్‌చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ ఉత్తర్వులను జారీ చేసింది.
చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడుల వర్షం!
Comments
Please login to add a commentAdd a comment