కొందరూ కార్పొరేట్ స్కూల్స్‌లో చదవకపోయినా వారికి ధీటుగా కళ్లు చెదిరే రేంజ్‌లో జాబ్ ఆఫర్‌లు అందుకుంటారు. కనీసం పట్టణ ప్రాంత నేపథ్యం కాకపోయినా అలవోకగా అందివచ్చిన ప్రతి అవకాశంలోనూ తమ ప్రతిభా పాటవాలు చాటుకుంటారు. ఎవ్వరూ ఊహించని రీతీలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వాళ్లు నోరువిప్పి చెబితేగానీ తెలియదు వారు అంతటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చారా అని... !. అలాంటి కోవకు చెందిందే అశ్రిత. ఆమెకు డీఆర్‌డీవో, ఇస్రో వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు జాబ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే వాటన్నింటిని వద్దనుకుని ఏకంగా అమెరికా మల్టీనేషనల్ కంపెనీలో మంచి వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ని అందుకుని శెభాష్ అనుపించుకుంది. ఎవరా అశ్రిత అంటే..
తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి అశ్రిత. కుటుంబం జీవనోపాధి వ్యవసాయం. చిన్ననాటి నుంచి సాధారణంగానే చదివేది. ఇంటర్ పూర్తి అయ్యిన వెంటనే ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలనే ఆలోచనలు కూడా పెద్దగా ఏమిలేవు. అందిరిలా బీటెక్ చేద్దాం అనుకుంది అంతే. అలా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్‌లో బిటెక్ డిగ్రీ పూర్తి చేసింది. అయితే అశ్రితకి అక్కడ నుంచి ఆమె కెరీర్‌పై సరైన స్పష్టత ఏర్పడింది.
అందరూ సాఫ్ట్‌వేర్ వైపు మళ్లితే ఆమె మాత్రం హార్డ్‌వేర్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం సంపాదించాలనుకుని అటువైపుగా కెరీర్‌ని ఎంచుకుంది. ఆ నేపథ్యంలో ఎంటెక్ చేయడం కోసం గేట్‌కి ప్రిపేరయ్యింది. అయితే తొలి ప్రయత్నంలో మూడువేల ర్యాంకు రావడంతో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జాయిన్ అవకాశం కోల్పోయింది. దీంతో ఆమె మరోసారి గేట్‌కి ప్రిపేరవ్వాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది.
అలా 2022లో ఆల్ ఇండియా 36 ర్యాంకు సాధించింది. ఈ విజయంతో ఆమెకు ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్, ఎన్‌పీసీఐఎల్ వంటి అగ్ర సంస్థల్లో ఉద్యోగ ఆఫర్‌ని అందుకుంది. అయితే వాటన్నింటిని కాదనుకుని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ పూర్తి చేయడం వైపే మొగ్గు చూపింది.
ఆ తర్వాత అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌వీఐడీఐఏ(NVIDIA)లో రూ. 52 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజ్‌తో ఉద్యోగాన్ని పొందింది. వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురు అశ్రిత అసాధారణమైన విజయం సాధించిందంటూ మురిసిపోయారు.
(చదవండి: 'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!)
Comments
Please login to add a commentAdd a comment