బెంగళూరు: పార్లమెంట్, శాసన సభలు ఉన్నది చర్చలు, నిర్ణయాల కోసమే తప్ప గొడవలు, అంతరాయాల కోసం కాదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో చోటుచేసుకున్న అనుచిత పరిణామాలను వెంకయ్య ప్రస్తావించారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ‘‘పార్లమెంట్‌లో ఇటీవల ఏం జరిగిందో మీరు చూశారు. సార్.. మీరు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి. రాజ్యసభలో మీరెందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అని కొందరు యువతీ యువకులు అడిగారు. సభలో కొందరు ఎంపీల ప్రవర్తన వల్లే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని సమాధానమిచ్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment