బ్యాట్ పట్టిన వెంకయ్య నాయుడు | M Venkaiah Naidu turns Cricket Batsman | Sakshi
Sakshi News home page

బ్యాట్ పట్టిన వెంకయ్య నాయుడు

Jan 14 2014 10:41 AM | Updated on Oct 20 2018 6:04 PM

బ్యాట్ పట్టిన వెంకయ్య నాయుడు - Sakshi

బ్యాట్ పట్టిన వెంకయ్య నాయుడు

మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు క్రికెట్ అవతారమెత్తారు.

నెల్లూరు: మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు క్రికెట్ అవతారమెత్తారు. ప్రాస మాటలతో విపక్షాలతో గూగ్లీలు సంధించే ఆయన బ్యాటింగ్తో బంతులను ఎదుర్కొన్నారు.

తెల్లపంచె, చొక్కాతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే వెంకయ్య సోమవారం తెల్లట్రౌజర్, తెల్లచొక్కా, బూట్లు, టోపీతో క్రికెట్ క్రీడాకారుడి గెటప్‌లో దర్శనమిచ్చారు. కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు. ‘ఖేలేంగే యువ- జీతేంగే భారత్’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement