'అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే ఉగ్రదాడి' | Terrorists to target Amarnath piligrims | Sakshi
Sakshi News home page

'అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే ఉగ్రదాడి'

Published Mon, Jul 27 2015 2:33 PM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

'అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే ఉగ్రదాడి' - Sakshi

'అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే ఉగ్రదాడి'

న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగానే పంజాబ్లోని గురుదాస్పూర్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని కేంద్ర పట్టణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. గురుదాస్పూర్ ఘటనపై రాజకీయం చేయడం సరికాదన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పార్లమెంట్లో ఏ విషయాన్ని అయినా చర్చించడానికి తాము సిద్ధమని తెలిపారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరస్టులే దాడి చేశారని నిర్ధారించినట్టు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

కాగా, పంజాబ్లోని గురుదాస్ పూర్లో ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్పై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడుల్లో ఇప్పటివరకు 13మంది మృతిచెందినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement