
వెంకయ్యనాయుడు
దేశ చరిత్రలో అత్యంత బలహీన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఖ్యాతి గడించారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు.
దేశ చరిత్రలో అత్యంత బలహీన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఖ్యాతి గడించారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. మన్మోహన్ పాలనలో దేశం అన్ని విధాల సర్వనాశనం అయిందని వెంకయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సోనియా కుటుంబం పట్ల విధేయత ప్రకటించేందుకే ప్రధాని మీడియా సమావేశం నిర్వహించారని ఆయన ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ నిర్వహించిన సమావేశంలో ఆయన తీరు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరోకటి లేదని పేర్కొన్నారు. సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైన ఎందుకు స్పందించదని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రశ్నించారు.
దేశంలో అంతులేని అవినీతి, కుంభకోణాలు, ఆకాశానంటిన ధరలు, నిరుద్యోగం యూపీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకతలు అని ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో 9 శాతం ఉన్న వృద్ధిరేటు 4 శాతాని పడిపోయిందన్నారు. అలాగే వ్యవసాయం వృద్ధిరేటు - 1.9 శాతానికి దిగజార్చిన ఘనత యూపీఏదే అని ఆయన ఆరోపించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని చూసి కాంగ్రెస్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం దేశం అంధకారంలో ఉందని, ఆ అంధకారంలో నరేంద్ర మోడీ ఆశాకిరణమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చ జరిగాలని వెంకయ్యనాయుడు అభిప్రాపడ్డారు.