
‘యూటీ’ మాటే లేదు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్‌ను ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే అవకాశం లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలాంటి ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీమాంధ్రకు దక్కనందున ఇంకొక ప్రాంతానికి దక్కరాదనే ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి రాజధాని నిర్మించుకోవడం చక్కని పరిష్కారమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదా వ్యవధిని మరింతగా పెంచాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.