'మహారాజ'కు రజనీకాంత్‌ ఫిదా.. దర్శకుడిని ఇంటికి పిలిచి ఆతిథ్యం | Maharaja Director Nithilan Meet With Superstar Rajinikanth, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

'మహారాజ' సినిమా చూసి డైరెక్టర్‌ను అభినందించిన రజనీకాంత్‌

Published Fri, Aug 2 2024 4:15 PM | Last Updated on Fri, Aug 2 2024 5:33 PM

Maharaja Director Nithilan Meet With Rajinikanth

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆయన సీనీ కెరీర్‌లో 50వ మైలురాయిని అందుకున్న చిత్రంగా రికార్డ్‌ క్రియేడం చేయడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సినీ విమర్శకుల చేత కూడా మెప్పించే విధంగా కథ ఉండటంతో అభినందనలు దక్కాయి. సస్పెన్స్‌, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ నిథిలన్‌ స్వామినాథన్‌ ప్రతిభకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన్ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభినందించారు.

మహారాజ సినిమాలో దర్శకుడి  ప్రతిభ ఎంతమేరకు ఉందో  విజయ్‌ సేతుపతి నటన కూడా అంతే స్థాయిలో ఉంది. సినిమా మొత్తం తన భుజాలపై మోసి అద్భుతమైన నటుడిగా మళ్లీ నిరూపించుకున్నారు. కేవలం రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లు రాబట్టింది. ఇంతటీ హిట్‌ అందుకున్న మహారాజ చిత్రాన్ని తాజాగా రజనీకాంత్‌ చూశారు. ఈ సందర్భంలో దర్శకుడు నితిలన్ సామినాథన్‌ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. 

రజనీకాంత్‌ చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. ఆ విషయాలను నిథిలన్‌ ఇలా పంచుకున్నారు.  ప్రియమైన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సమావేశంలో మీ అనుభవాల నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీ మాటలు బంగారు అక్షరాలతో వ్రాసిన నవల చదివినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి నేను తమిళ సినిమా ప్రపంచంలో మరో జీవితాన్ని చవిచూస్తాను. మీ జీవితానుభవ విషయాలు నాతో పంచుకుని చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ వినయం, ఆతిథ్యానికి నేను ఎప్పటికీ మరిచిపోలేను. 

మహారాజా సినిమా మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో తలచుకుంటేనే ముచ్చటగా ఉంది. చిరకాలం ఆనందంగా ఉండాలని నన్ను ఆశీర్వదించారు. మరోసారి ధన్యవాదాలు తలైవా..' అని దర్శకుడు నితిలన్ సామినాథన్ పోస్ట్‌ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు లైకులు, కామెంట్లు విసురుతున్నారు. తలైవాను కలుసుకునే అవకాశం దక్కినందుకు కంగ్రాట్స్‌ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement