బాలీవుడ్‌ స్టార్‌ హీరోకు విలన్‌గా విజయ్‌ సేతుపతి? | Vijay Sethupathi as Villain in Shahrukh Khan and Atlee Movie Jawan | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi-Shah Rukh Khan: బాలీవుడ్‌ స్టార్‌ హీరోకు విలన్‌గా విజయ్‌ సేతుపతి?

Published Wed, Jul 6 2022 1:50 PM | Last Updated on Wed, Jul 6 2022 2:54 PM

Vijay Sethupathi as Villain in Shahrukh Khan and Atlee Movie Jawan - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఉప్పెన మూవీతో తెలుగులో విలన్‌గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో తలపెడేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ హీరోగా దర్శకుడు అట్లీ దర్శకత్వంతో జవాన్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కథానాయికగా చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీలో విలన్‌గా విజయ్‌ సేతుపతి పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకుంటోంది. అయితే ఇందులో పవర్ఫుల్ విలన్ రోల్‌ను అట్లీ డిజైన్‌ చేశాడట. ఇక ఈ పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే బాగుంటుందని దర్శకుడు షారుక్‌ను ఒప్పించినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో వెంటనే విలన్‌ రోల్‌ కోసం మూవీ టీం ఇప్పటికే విజయ్‌ సేతుపతిని సంప్రదించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక దీనికి విజయ్‌ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. త్వరలోనే సినిమా షూటింగు సెట్‌లో అడుగు పెడతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి హిందీ చిత్రంలో విలన్‌గా అంటే మంచి ఆఫర్‌ అని, ఈ  సినిమాతో విజయ్ సేతుపతి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగగా.. సాన్య మల్హోత్రా,  ప్రియమణి  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement