Pushpa First Look : Sunil as Mangalam Srinu in Pushpa Movie - Sakshi
Sakshi News home page

Sunil: మంగళం శ్రీనుగా భయపెడుతున్న సునీల్‌..

Nov 7 2021 11:12 AM | Updated on Nov 7 2021 11:58 AM

Sunil As Mangalam Srinu In Pushpa Movie - Sakshi

Sunil First Look as Mangalam Srinu in Pushpa Movie: ఇప్పటివరకు హాస్యనటుడిగా, హీరోగా అలరించిన సునీల్‌ తొలిసారిగా 'పుష్ప' కోసం విల‌న్‌గా మారాడు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాలో సునీల్..  మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో క‌నిపించ‌నునున్నాడు. దీనికి సంబంధించి సునీల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఇందులో మునుపెన్నడూ లేని విధంగా  బ‌ట్ట‌త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చి అందరికి షాక్‌ ఇచ్చాడు.భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ రానున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement