Kamal Haasan as Villain in Prashanth Neel, Jr.NTR 31 Movie - Sakshi
Sakshi News home page

Jr.NTR 31 Update: ఎన్టీఆర్‌కు విలన్‌గా కమల్‌ హాసన్‌ !

Published Sun, May 22 2022 6:26 PM | Last Updated on Sun, May 22 2022 7:02 PM

Kamal Haasan As Villain In Prashanth Neel NTR 31 Movie - Sakshi

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2 సినిమాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్‌ చేశాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించి యావత్ దేశ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో సలార్‌ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని ప్రకటించాడు ప్రశాంత్ నీల్‌. తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్‌ 31’ ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో తారక్‌ లుక్‌ ఎంత మాస్‌గా ఉండబోతుందో రివీల్‌ చేసి ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 

అయితే ఎన్టీఆర్‌ 31వ చిత్రంగా వస్తున్న సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే విలన్‌ పాత్రలో యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ను బరిలోకి దించనున్నాడట. ఇటీవల విడుదలై విక్రమ్‌ ట్రైలర్‌లో కమల్ లుక్స్‌ మాస్‌గా, రఫ్‌గా కనిపించడంతో ఆయన అయితేనే ఈ మూవీలో విలన్‌ రోల్‌కు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ భావించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథను కమల్‌ హాసన్‌కు వినిపించగా, ఆయన కూడా కథ బాగా నచ్చి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ 'ఇదెక్కడి మాస్‌ ఐడియా నీల్‌ మావా' అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇటు ఎన్టీఆర్‌, అటు కమల్‌ హాసన్‌ యాక్టింగ్‌ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. 

చదవండి: నన్ను క్షమించండి..అభిమానులకు ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement