విలన్‌గా బ్రహ్మానందం | brahmanandam as a villain character in lava kusa movie | Sakshi
Sakshi News home page

విలన్‌గా బ్రహ్మానందం

Published Sat, Mar 7 2015 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

విలన్‌గా బ్రహ్మానందం

విలన్‌గా బ్రహ్మానందం

బ్రహ్మానందం ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి, ప్రేక్షకుల్ని నవ్వించేస్తారు. మరి.. ఆయన విలన్‌గా చేస్తే? ఎలా ఉంటుందో ‘లవకుశ’ చిత్రంలో చూడొచ్చు. వరుణ్ సందేశ్ హీరోగా జయశ్రీ శివన్ దర్శకత్వంలో సంగారెడ్డి పేట ప్రకాశ్, వి. సత్యమోహన్‌రెడ్డి, పండుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను తదితరులపై చిత్రీకరించిన ప్రచార గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ‘‘నేను తొలిసారి రెండు పాత్రలు చేసిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బ్రహ్మానందంగారిని సంప్రదించినప్పుడు ఇప్పటికి వెయ్యి సినిమాలకు పైగా చేశా.. ఏదైనా వెరైటీ కారెక్టర్ ఉంటే చెప్పమన్నారు. ఈ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు’’ అని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో శేఖర్ విఖ్యాత్, కాసర్ల శ్యామ్, రామ్‌నారాయణ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement