విశాల్‌కు విలన్‌గా ఆర్య? | Arya the villain for Vishal in Irumbu Thirai | Sakshi
Sakshi News home page

విశాల్‌కు విలన్‌గా ఆర్య?

Published Wed, Oct 19 2016 2:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

విశాల్‌కు విలన్‌గా ఆర్య?

విశాల్‌కు విలన్‌గా ఆర్య?

నటుడు విశాల్‌కు ఆర్యకు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరే ఒరే అని పిలుచుకునేంత మిత్రుత్వం వారిది. అలాంటిది ఆర్య విశాల్‌కు విలన్‌గా మారడం ఏమిటన్న సందేహం కలగవచ్చు. అయితే రియల్ జీవితంలో మిత్రులైన వీరు రీల్ జీవితంలో శత్రువులుగా మారనున్నారన్నది  కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. వివరాల్లోకెళితే విశాల్ ప్రస్తుతం కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు. కత్తిసండై చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించినా, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు.
 
 కాగా తుప్పరివాలన్ చిత్రం పూర్తి చేసిన తరువాత విశాల్ నవదర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇరుంబు కుదిరై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు మహానటుడు శివాజీగణేశన్ నటించిన చిత్రం టైటిల్ అన్నది గమనార్హం.
 
  ఇందులో విశాల్‌కు విలన్‌గా ప్రముఖ నటుడిని ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటుడు ఆర్య అయితే బాగుంటుందని ఆయన్ని విలన్‌ను చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్యకు తమిళంలో హీరో ఇమేజ్ ఉన్నా ఆయన ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. అయితే ఆర్య విశాల్‌కు విలన్ అవుతారా? లేదా?అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ క్రేజీ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్‌రాజా, చాయాగ్ర హణం జార్జ్ సీ.విలియమ్స్ అందించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement