నటితోనే ఏడడుగులు | Hero Vishal To Marry Actress | Sakshi
Sakshi News home page

నటితోనే ఏడడుగులు

Published Tue, Oct 22 2013 8:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

నటితోనే ఏడడుగులు

నటితోనే ఏడడుగులు

హీరో విశాల్ ....నటితోనే ఏడడుగులు వేస్తానంటున్నాడు. యువ హీరోలలో ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న వారిలో ఒకరు విశాల్, మరొకరు ఆర్య. వీరిద్దరూ మంచి స్నేహితులన్నది తెలిసిన విషయమే. ఆర్య వివాహం తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని ఇటీవలి విశాల్ ఓ ప్రకటన కూడా చేశాడు.ఆర్య, తన పెళ్లి ఒకే రోజు, ఒకే వేదికపై, ఒకే సమయంలో చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు భావించారని....అయితే  అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఆర్య వివాహం అయిన మరునాడే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పానని విశాల్ తెలిపాడు.

తనకు  కాబోయే సతీమణి చిత్ర రంగానికి చెందిన అమ్మాయా? లేక బయటవారా అని చాలా మంది అడుగుతున్నారని .... తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నటి లేదా డ్యాన్సర్ అయి ఉంటుందని విశాల్ తెలిపాడు. అయితే కుటుంబ సభ్యుల అనుమతితోనే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా విశాల్.... ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో పడినట్లు కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా నటి రాధిక ...ఈ వివాహానికి పెద్దరికం వహిస్తున్నట్లు సమాచారం. సో... తన పెళ్లి నిశ్చయమైనా... ఆర్య కోసం విశాల్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ విశాల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement