Actor Vishal Gets Hairline Fracture In Laththi Movie Stunt Sequence Shooting, Details Inside - Sakshi
Sakshi News home page

Vishal Injury: చిన్నారిని కాపాడే సీన్‌లో విశాల్‌కు గాయాలు

Published Sat, Feb 12 2022 9:46 AM | Last Updated on Sat, Feb 12 2022 11:23 AM

Hero Vishal Injured In Laththi Stunt Sequence Shooting - Sakshi

తమిళ హీరో విశాల్‌ షూటింగ్‌లో గాయాలపాలయ్యాడు. హైదరాబాద్‌లో లాఠీ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తున్న సమయంలో అతడు గాయపడ్డాడు. విలన్‌ నుంచి చిన్నారిని కాపాడే సీన్‌లో అతడు భవనంపై నుంచి దూకాలి. ఈ క్రమంలో అతడి చేతికి, నుదుటికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు షూటింగ్‌కు బ్రేక్‌ చెప్పి కేరళ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు.

చేతికి గాయాల కారణంగా సినిమా షూటింగ్‌ను మార్చికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని విశాల్‌ ట్విటర్‌లో అధికారికంగా వెల్లడించాడు. చేతికి ఫ్రాక్చర్‌ అయినందున ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తిరిగి మార్చి మొదటివారంలో ఫైనల్‌ షెడ్యూల్‌లో పాల్గొంటానని తెలిపాడు. కాగా లాఠీ సినిమాలో విశాల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement