మహేశ్‌ ద్విపాత్రాభినయం.. విలన్‌గా కూడా..? | Prithviraj Sukumaran To Play A Negative Role In SS Rajamouli And Mahesh Babu SSMB29, Deets Inside | Sakshi
Sakshi News home page

SSMB29: మహేశ్‌ ద్విపాత్రాభినయం.. విలన్‌గా కూడా..?

Published Tue, Jul 9 2024 1:04 AM | Last Updated on Tue, Jul 9 2024 12:52 PM

Prithviraj Sukumaran to play a negative role in SS Rajamouli and Mahesh Babu SSMB29

మహేశ్‌బాబు విలన్‌ పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం లేకపోలేదు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి హీరో పాత్ర అన్నది కన్ఫార్మ్‌. రెండోది విలన్‌ అని సమాచారం. కాగా విలన్‌ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ని అనుకున్నారనే వార్త వచ్చింది.

ఆ తర్వాత విక్రమ్‌ పేరు వినిపించింది. అయితే ఈ రెండు పాత్రలనూ మహేశ్‌బాబుతోనే చేయించాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఆఫ్రికాలోని అమేజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ మధ్య కండలు తిరిగిన దేహం, కాస్త లెంగ్తీ హెయిర్, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు మహేశ్‌. రాజమౌళి సినిమా కోసమే ఇలా మేకోవర్‌ అయ్యారని సమాచారం.

త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలని అనుకుంటున్నారు. మరి... ఈ సినిమాలో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అదే నిజమైతే హీరో... విలన్‌గానా? లేక రెండు పాజిటివ్‌ క్యారెక్టర్సా? అనేది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement