విలన్ పాత్రలకూ సై | Hero Rana Daggubati ready to be Villain Role | Sakshi
Sakshi News home page

విలన్ పాత్రలకూ సై

Published Sun, Oct 12 2014 2:35 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

విలన్ పాత్రలకూ సై - Sakshi

విలన్ పాత్రలకూ సై

క్యారెక్టర్ నచ్చితే టాలీవుడ్ సే బాలీవుడ్ తక్.. ఏ వుడ్‌లో అయినా విలన్ రోల్ చేయడానికి సిద్ధమంటున్నాడు హీరో రానా దగ్గుబాటి. ప్రతినాయకుడి పాత్రల్లో తనకు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఆదర్శమని చెబుతున్నాడు. బేగంపేటలోని ది హిందు పత్రిక కార్యాలయంలో శనివారం ‘ది హిందు బ్రైడల్ మంత్ర 2014’ 5వ ఎడిషన్ మేగజైన్‌ను రానా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జనరల్ మేనేజర్ (అడ్వర్టైజింగ్-ఏపీ) సీహెచ్ వెంకటరత్నం, తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక అంశాలతో ముడిపడిన లీడర్ చిత్రానికి, రాజులు, రాజ్యాలు, యుద్ధాలతో సాగే బాహుబలి సినిమాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నాడు.

ఇలా రెండు వైవిధ్యభరితమైన చిత్రాలు.. తన కు నటుడిగా పూర్తిస్థాయి శిక్షణ అందించాయని అన్నాడు. ‘వచ్చే వేసవిలో బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ 2016 వరకు పూర్తవుతుందని ఆశిస్తున్నా. కథ, కథనం రెండూ నచ్చితే బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నాను’ అని రానా తెలిపాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్, రానా హీరోలుగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’ వచ్చే ఏడాది జనవరి 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
పెళ్లి పుస్తకం..
‘ది హిందు బ్రైడల్ మంత్ర 2014’ మేగజైన్ 5వ ఎడిషన్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ మేగజైన్‌లో పెళ్లి సంబంధాలు మొదలుకొని వేడుకలు, మేకప్‌లు, అంతర్జాతీయ డి జైనర్లతో డిజైన్ చేయించిన బ్రైడల్ డ్రెస్సింగ్, జ్యువెలరీ డిజైన్స్, ఫస్ట్ నైట్ హాట్ స్పాట్స్.. ఇలా వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పొందుపరచారు. దీంతో పాటు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఫుడ్ కార్నర్స్, వింటేజ్ డ్రామా, ఫ్యాషన్ యాత్ర, కాక్‌టెయిల్ పార్టీస్, ఇంటీరియర్, రెసిపీస్ వంటివి పొందుపరిచారు. ‘బ్రైడల్ మంత్ర 2014’ అక్టోబర్-డిసెంబర్ మేగజైన్ కవర్ పేజీని బాలీవుడ్ కథానాయిక ఇషాగుప్తా ఫొటోతో అందంగా డిజైన్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement